వయసు ఎంత పెరిగినా కూడా గ్లామర్ డోస్ తగ్గకుండా చూసుకునే నటీమణుల్లో కరీనాకపూర్ ఒకరు. అలాగే కౌంటర్లు వేయడంలో కూడా అమ్మడు యమ స్పీడ్ గా ఉంటుంది. గ్లామర్ డోస్ తో పాటు కామెంట్స్ డోస్ కూడా పంచుతోన్న ఈ బ్యూటీ ఇటీవల కురచ దుస్థులు వేసుకోవడంపై ఎవరు ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చింది. 

అర్బజ్‌ఖాన్ వెబ్ షో పించ్ లో తొలి గెస్ట్ గా ప్రత్యక్షం కానున్న కరీనా షో ద్వారా వచ్చిన ట్వీట్స్ కు సమాధానం ఇస్తుండగా ఎంత కోటీశ్వరులైతే మాత్రం కురచదుస్తులు వేసుకోవాలా? అనే ప్రశ్న ఎదురైంది. 

అందుకు సమాధానంగా కరీనా ఇలా మాట్లాడింది. ' ఓ విధంగా మేము డబ్బు ఆదా చేస్తున్నాం. అందువల్లే ధనవంతులమవుతున్నాం. మిగతా వాటిని తేలిగ్గా కొనేస్తున్నాం. బట్టలపై ఖర్చులు పెద్దగా చేయలేము అని కరీనా ఎవరు ఊహించని విధంగా సేటైరికల్ ఆన్సర్ ఇచ్చింది. ఇక సెలబ్రెటీలను ఎవరుపడితే వారు తక్కువ చేసి మాట్లాడుతుంటే ఏమి అనలేక సైలెంట్ గా ఉండాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు.