సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విగ్రహం ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేసింది నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి. ఇంతకీ ఆమె అభ్యంతరం ఏంటంటే..?  

త్వరలో నందమూరి తారకరాముడి శత జయంతి ఉత్సవం నేపధ్యంలో.. అట్టహాసంగా ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఈనేపథ్యంలో ఖమ్మంలో లకారం మినీ ట్యాంక్ బండ్ పై 54 అడుగుల తారకరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విగ్రహావిష్కరణకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విగ్రహం ఏర్పాటుపై ఇప్పటికే వివాదాలు స్టార్ట్ అయ్యాయి. ఈ విషయంలో యాదవ సంఘలతో కలిసి.. పలు హిందూ సంస్థలు అభ్యంతరం వ్యాక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా వీరితో కలిసి తమ వాయిస్ వినిపించింది సినీ నటి .. బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి. విగ్రహం ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ఖమ్మలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎన్టీఆర్‌ విగ్రహం ఇలా కృష్టుడి ఆకారంలో లేదు.. దాంతో ఇక్కడ అలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇక ఇప్పుడు ఈ విగ్రహం ఏర్పాటుపై నటి కరాటే కల్యాణి ఆధ్వర్యంలో హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరాలు తెలియజేస్తున్నాయి. పెద్దాయిన ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయడంపై తమకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు కరాటే కళ్యాణి. మహానుభావుడి విగ్రహం పెట్టడం అందరికి ఇష్టమే అన్నారు. కాని తారకరాముని విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో తయారు చేయడంపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఆమె వెల్లడించారు. అంతే కాదు ఈ విషయంలో ఆమె తీవ్రంగా స్పందించింది. ఎలక్షన్స్ వస్తుండటంతో.. ఓట్లకోసమే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ.. ఆమె ఆరోపించారు. 

అసలు ఎన్టీఆర్ అంటే ఎన్నో పాత్రలు గుర్తుకు వస్తాయి.. అటువంటి తారకరాముడిని కేవలం.. కృష్ణుడి రూపంలో తయారు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అయితే ఇలా కృష్ణుడిగా ఎన్టీఆర్ విగ్రహం వల్ల.. తరువాతి తరాలకు రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అన్నారు కళ్యాణి. అందుకే కచ్చితంగా ఆ విగ్రహ ఏర్పాటు ఆపాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే తాము విగ్రహావిష్కరణను అడ్డుకుంటామంటూ స్పష్టం చేశారు కళ్యాణి. ప్రస్తుతం ఆమె వాఖ్యలు వైరల్అవుతున్నాయి. సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.