హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. పాడుపని చేసి దొరికిపోయాడ ఓకన్నడ యంగ్ హీరో. సినిమా అవకాశాలు రాకనో.. విలాసాలకు అలవాటుపడో పాడుపనికి పూనుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే..? 

వ్యభిచార గృహం నిర్వహిస్తున్న పట్టుబడ్డారు ప్రముఖ కన్నడ హీరో మంజునాథ్ అలియాస్ సంజు. ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న ఈ వ్యాక్తిని పక్కా ప్రణాళికతో అరెస్ట్ చేశారు. బెంగళూర్ పోలీసులు. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ.. ఫుల్ టైమ్ వార్క్ గా వ్యాభిచారాన్ని చేయిస్తున్నాడు మంజునాథ్. తనకున్న సినీ పరిచయాలను వాడుకుంటూ.. దానికితోడుగా.. ఓ యాప్ ద్వారా విటులను సరాసరి వేశ్యా గృహానికి రప్పించడం స్టార్ట్ చేశాడు. ఈరకంగా ఎంతో మంది జీవితాలను మంజునాథ్ నాశనం చేసినట్టు తెలుస్తోంది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ వ్యభిచార గృహంపై దాడి చేసి మంజునాథ్ ను అరెస్ట్ చేశారు. 

మంజునాథ్ గత సంవత్సరం విడుదల అయిన న్యూరాన్ సినిమాలో నటించాడు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇతడి చీకటి భాగోతాన్ని పోలీసులు ఛేదించారు. బంగ్లాదేశ్ నుంచి బెంగళూరుకి అక్రమంగా అమ్మాయిలను తీసుకు వచ్చి బలవంతపు వ్యభిచారం చేయిస్తున్నారు అంటూ సమాచారం రావడంతో దాడి చేశారుపోలీసులు. 

బెంగళూరు నగరంలోని కెంగేరి డెంటల్ కాలేజీ సమీపంలో ఒక అద్దె ఇంటిలో ఈ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు రెక్కీ నిర్వహించారు. నిన్న తెల్లవారుజామున 4 నుంచి 5.30 గంటల మధ్య సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించి కెంగేరిలోని వినాయకనగర్, బాదరహళ్లి ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. నిందితులను విచారించగా మంజునాథ్ పేరు బయటకి వచ్చింది.