Asianet News TeluguAsianet News Telugu

ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, సడెన్ హార్ట్ ఎటాక్ తో కన్నడ దర్శకుడు కిరణ్ మృతి

వరుస మరణాలు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఏదో ఒక భాషలో.. ఎవరో ఒక పేరున్న నటులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు కిరణ్ సడెన్ గా కన్ను మూశారు. 

Kannada Director Kiran Govi Passed Away of heart attack jms
Author
First Published Mar 26, 2023, 10:30 AM IST


కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ శాండల్​వుడ్ డైరెక్టర్  కిరణ్ గోవి కన్నుమూశారు. 53 ఏళ్ల వయసులో సడెన్ హాట్ట్ ఎటాక్ తో ఆయన మరణించారు. రోజూలాగానే ఆఫీస్ కు వచ్చిన కిరణ్ సడెన్ గా గుండెపోటుకు గురయ్యారు.వెంటనే కిరణ్ గోవీని ఆయన ఆఫీసులోని స్టాఫ్​ దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. అయితే హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి కన్నచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యాక్తం చేస్తున్నారు. 

కన్నడ నాట  ఎన్నో సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేశారు కిరణ్. తెలుగులో కూడా ఒకటీ రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. కన్నడలో సంచారి, పయన, పారు వైఫ్​ ఆఫ్​ దేవదాస్, యారిగే యారింటు లాంటి పలు మూవీస్​ను కిరణ్​ గోవి తెరకెక్కించారు. ఇక తెలుగులో తిరుగుబోతు అనే సినిమాను కిరణ్ డైరెక్ట్ చేశారు. కాని ఆయనకు తెలుగులో అనుకున్నంత ఆఫర్లు రాలేదు. టాలీవుడ్ లో దర్శకుడిగా పేరు తెచ్చుకుందామనుకున్న కిరణ్ కు ..కన్నడ ఇండస్ట్రీలోనే  ఉండక తప్పలేదు. 

కిరణ్ మరణంతో  శాండల్​వుడ్​లో విషాదం నెలకొంది. కిరణ్​ మృతిపై కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కంంత మంది స్టార్స్ వారికుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించగా..మరికొంత మంది  సోషల్ మీడియా ద్వారా సంతాపాలు తెలియజేస్తున్నారు. మరికొంత మంది మాత్రం నేరుగా నివాళి అర్పిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios