Asianet News TeluguAsianet News Telugu

`కంగువా` టీజర్‌ విజువల్‌ వండర్‌.. సూర్య, బాబీ డియోల్‌ల విశ్వరూపం..

సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `కంగువా`. శివ టీమ్‌ రూపొందిస్తున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. విజువల్‌ వండర్‌లా మతిపోగొడుతుంది. 
 

kanguva teaser visual wonder suriya next level show arj
Author
First Published Mar 19, 2024, 6:49 PM IST

జాతీయ అవార్డు విన్నర్‌ సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ `కంగువా`. సరికొత్త కథతో భారీ స్థాయిలో ఓ విజువల్‌ వండర్‌లా ఈ మూవీ రూపొందుతుంది. దర్శకుడు శివ టీమ్‌ ఈ మూవీని రూపొందిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నుంచి గతేడాది గ్లింప్స్ విడుదలైంది. తాజాగా టీజర్‌ని విడుదల చేశారు. 

Polling:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

`కంగువా` టీజర్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. విజువల్‌ వండర్‌ని తలపిస్తుంది. హాలీవుడ్‌ సినిమాలను మరిపిస్తుంది. ఒక ఫారెస్ట్ లో ట్రైబల్‌ తెగల మధ్య పోరాటం నేపథ్యంలో సాగే చిత్రంగా ఇది తెలుస్తుంది. తెగల నాయకుడు సూర్య, ప్రత్యర్థలతో చేసే పోరాటం, ఈ క్రమంలో ఆయన విరోచితమైన యాక్షన్‌ గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ఓ వైపు సూర్య విశ్వరూపం, మరోవైపు బాబీ డియోల్‌ హంగామా వెరసి ఇద్దరు తలపడితే ఎలా ఉంటుంది, దానికి ప్రతిబింబంగా ` కంగువా` టీజర్‌ నిలుస్తుంది. 

అయితే ఇది పూర్తి విజువల్‌ వండర్‌లా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఇప్పటి వరకు ఈ రేంజ్‌ విజువల్స్ తో ఇండియన్‌ సినిమా రాలేదు అనేంతగా ఉండటం విశేషం. దీనికితోడు భారీ యాక్షన్‌ సీన్లు మైండ్‌ బ్లాక్‌ చేసేలా ఉన్నాయి. ఇక చివర్లో సూర్య, బాబీ డియోల్‌ ఎదురుపడి గర్జించడం నెక్ట్స్ లెవల్‌. పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ టీజర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది. 

కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్ తో వరల్డ్ సినిమాని గుర్తు చేస్తుంది. హై క్వాలిటీ విజువల్స్ ను దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసింది. ఉధిరన్ తో కంగువ చేసిన రూత్ లెస్, ఫెరోషియస్ ఫైట్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా కోసం హీరో సూర్య పడిన శ్రమంతా ఆయన మేకోవర్, క్యారెక్టర్ లో రిఫ్లెక్ట్ అయ్యింది.

'కంగువ' సినిమాను భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కే ఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్టు టీమ్‌ వెల్లడించింది. 

Read more: నరేష్‌ నాలుగు పెళ్లిళ్లపై నవీన్‌ విజయ్‌ కృష్ణ రియాక్షన్‌ ఇదే.. వామ్మో తండ్రిని మించిన కొడుకు
 

Follow Us:
Download App:
  • android
  • ios