ఇతర నటీనటులపై సోషల్ మీడియాలో చిర్రుబుర్రులాడుతూ కంగనా సోదరి రంగోలి హల్ చల్ చేస్తున్నారు. కంగనాపై విమర్శలు చేసే వారందరికీ ఘాటుగా సమాధానం ఇస్తూ ఇటీవల హాట్ టాపిక్ గా మారారు. అలాంటి రంగోలి తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై ప్రశంసలు కురిపించింది. సమంత ఓ దేవత అంటూ ఆకాశానికెత్తేసింది. 

సమంత నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రం ఓ బేబీ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓ బేబీ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ గమనించిన రంగోలి సోషల్ మీడియా వేదికగా సమంతని అభినందించింది. 

'ఓ బేబీ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. సమంత అసలు సిసలైన ఫెమినిస్ట్. ఆమె జీవితంలో కూడా సక్సెస్ సాధించింది. గొప్ప కుటుంబమైన అక్కినేని ఫ్యామిలీకి చెందిన మహిళ. అయినప్పటికీ సమంత తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంది. సమంత లాంటి దేవతల్ని మేము మెచ్చుకుంటాం. కంగనా రనౌత్ తరుపున నీకు ఆల్ ది బెస్ట్' అని రంగోలి ట్వీట్ చేశారు. 

నా గురించి చక్కగా మాట్లాడినందుకు ధన్యవాదాలు అంటూ సమంత రిప్లై ఇచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ చిత్రంలో సమంత 70 వృద్ధురాలు 20 ఏళ్ల యువతిగా మారిపోయే పాత్రలో నటించింది.