Asianet News TeluguAsianet News Telugu

ఇందిరా గాంధీపై కంగనా సంచలన వ్యాఖ్యలు .. అలా అనేసిందేంటి..?

మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. తెలిసి అన్నదా తెలియక అన్నదా తెలియదు కాని.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై మాత్రం సంచలన వ్యాఖ్యలుచేసింది. 
 

Kangana Ranaut Different comments about Indira Gandhi  Jms
Author
First Published Feb 12, 2024, 9:15 AM IST


బాలీవుడ్ లో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ఎంత పెద్ద స్టార్ అయినా... ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పేస్తుంది కంగనా. ఏ విషయంపై అయినా తాను స్పందించాలి అనుకుంటే.. తనవర్షన్ ను గట్టిగా వినిపిస్తుంది. పొలిటికల్ అయినా.. సినిమా అయినా.. ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద దుమ్ముదులిపేస్తుంది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ. ఈకారణంగానే ఇండస్ట్రీలో అందరికి దూరంఅయ్యిందికంగనా.. అవార్డ్ లు, రివార్డ్ లు, సినిమా ఫంక్షన్లు.. ఇంటర్వ్యలు..ఇలాంటి వాటిలో వేటికీ.. ఆమెకు పిలుపు ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే.. అనఫిషియల్ గా కంగనాను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించారనే చెప్పాలి. 

బాలీవుడ్ ఎలా ఉన్నా.. తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తోంది కంగనా రనౌత్. ఎక్కువగా సౌత్ సినిమాల్లో మెరుస్తోంది. తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తోంది కంగనా రనౌత్. ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ కు ముస్తాబుతోంది. ఈసినిమాలో ఇందిరాగాంధీ పాత్రలో నటించారు కంగనా రనౌత్. ఇందిరా గాంధీ ప్రధానిగాఉన్న టైమ్ లో ఏర్పడిన ఎమర్జెన్సీ కాలాన్ని బేస్ చేసుకుని ఈసినిమా తెరకెక్కింది. ఇక ఇందిర లుక్ లో కంగనా అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈక్రమంలో ఓ సందర్భంలో కంగనా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

ఈమధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్.. ఇందిరపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈకార్యక్రమంలో పాల్గొన్న కంగనాను మీడియా ప్రశ్నిస్తూ..మీకుప్రధాని కావాలని ఎప్పుడు ఆలోచన రాలేదా అని అడిగారు. దాంతో ఆమె స్పందిస్తూ.. ఈసినిమాలో నేను ప్రధాని పాత్రలోనే కదా నటించింది. ఎమర్జెన్సీ సినిమాలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నేను నటించాను. ఆసినిమా చూసిన తరువాత ఎవరూ ప్రధాని అవ్వాలి అని కోరుకోరు అని అన్నారు. ఈ ఆన్సర్ తో అంతా షాక్ అయ్యారు. అసలు ఈమె ఏ అర్ధం వచ్చేలా మాట్లాడింతో తెలియక అయోమయంలో పడ్డారు. 

ఇక మరికొన్ని వ్యాఖ్యలు చేశారు కంగనారనౌత్. రాజకీయాల్లోకి రావాలి అంటే.. దానికి ధైర్యం కావాలి.. నాలా సున్నితంగా ఉంటే రాజకీయాలుచేయలేదు. అందుకే నాకు రాజకీయాలు చేయాలన్న ఆలోచన లేదు. రావాలన్న ఆశ కూడా లేదు అన్నారు కంగాన. చాలా మది తనను రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నారని.. కాని ఆసాహసం మాత్రం చేయలేకపోతున్నా అన్నారు కంగనా. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios