Asianet News TeluguAsianet News Telugu

కాంచన 3: రిలీజ్ డేట్ మారింది!

టాలీవుడ్ - కోలీవుడ్ ఇండస్ట్రీలో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న స్టార్ సెలబ్రెటీ రాఘవ లారెన్స్ మరో సరికొత్త ప్రయోగాన్నీ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దర్శకుడు భారీ బడ్జెట్ తో కాంచన 3వ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

kanchana 3 telugu release date
Author
Hyderabad, First Published Mar 6, 2019, 2:46 PM IST

టాలీవుడ్ - కోలీవుడ్ ఇండస్ట్రీలో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న స్టార్ సెలబ్రెటీ రాఘవ లారెన్స్ మరో సరికొత్త ప్రయోగాన్నీ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దర్శకుడు భారీ బడ్జెట్ తో కాంచన 3వ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం సినిమా షూటింగ్ ఎండింగ్ లో ఉంది. రాఘవ లారెన్స్ హీరోగా దర్శకుడిగా అలాగే కోరియేగ్రాఫర్ గా వర్క్ చేస్తూ సినిమాను రూపొందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో సినిమా విడుదల కానుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాను మే1 న రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. అసలైతే ఏప్రిల్ లోనే సినిమా విడుదల కావాల్సింది. 

కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం అవుతుండడంతో సినిమా రిలీజ్ డేట్ ను మార్చారు. లారెన్స్ సరసన సినిమాలో వేదిక అలాగే బిగ్ బాస్ బ్యూటీ ఓవియా నటిస్తోంది. ఇంతకుముందు వచ్చిన ముని సిరీస్ లు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios