Asianet News TeluguAsianet News Telugu

Vikram:కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్ ,దుమ్ము రేపింది

కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి క్యారక్టర్స్  చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అందరిని సమానంగా చూపిస్తూ ట్రైలర్ కట్ చేశారు. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ ఓ రేంజ్ లో ఎలివేట్ అయింది. 

Kamal Haasan VIKRAM HITLIST (TELUGU) MOVIE Official Trailer
Author
Hyderabad, First Published May 20, 2022, 5:35 PM IST


 లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్‌. కార్తీ ఖైదీతో తనేంటో ప్రూవ్ చేసుకున్న లోకేష్‌ కనగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తమిళ 'విక్రమ్' ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా ఇప్పుడు తెలుగు ట్రైలర్ ని విడుదల చేసారు.  రామ్ చరణ్ ఈ ట్రైనర్ ను లాంచ్ చేశారు.యాక్షన్ సీన్స్, అదిరిపోయే డైలాగులుతో రెడీ అయ్యిన ఈ ట్రైలర్ పై మీరూ  ఓ లుక్కేయండి.

కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి క్యారక్టర్స్  చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అందరిని సమానంగా చూపిస్తూ ట్రైలర్ కట్ చేశారు. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ ఓ రేంజ్ లో ఎలివేట్ అయింది. కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్‌, విజయ్ సేతుపతి లుక్స్‌, యాక్టింగ్‌ కన్నుల పండుగగా ఉంది. ఎవరికీ వారి ప్రత్యేక నటనతో అదరగొట్టారు. యాక్షన్‌ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచింది. 

ఖైదీ, మాస్టర్‌ సినిమాల డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహించడం, ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటించడంతో ఇదివరకే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఇదేకాకుండా ఈ సినిమాలో సూర్య అతిథిగా కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే సినీ ప్రియులకు మంచి విందు దొరికినట్టే.   రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివాని నారాయణన్, కాళిదాస్ జయరామ్, అర్జున్ దాస్ తదితరులు నటిస్తున్నారు. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది.   
 

Follow Us:
Download App:
  • android
  • ios