ఎప్పుడెప్పుడా అని  ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఇండియన్ 2 సినిమా నుంచి, అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు కమల్ హాసన్. భారతీయుడు యాక్షన్ షూట్ కు సంబంధించి ఓ పిక్ ను లీక్ చేశాడు లోకనాయకుడు. 

ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. పాలిటిక్స్ లో బిజీ అవ్వడం, తీసిన ప్రతీ సినిమా ప్లాప్ అవ్వడంతో.. గత కొన్ని ఏళ్ళుగా కమల్ కు సాలిడ్ సినిమా పడలేదు. కాని లాస్ట్ ఇయర్ మాత్రం విక్రమ్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు కమల్ హాసన్. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈసినిమా, పాన్ ఇండియా స్థాయిలో మంచి రెస్పాన్స్ ను సాధించింది. అంతే కాదు భారీగా కలెక్షన్స్ కూడా సాధించింది సినిమా. విక్రమ్ క్లోజింగ్ కలెక్షన్స్ 400 కోట్లు దాటాయి. కమల్ హాసన్ కెరీర్ లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా విక్రమ్ నిలిచింది.

విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత.. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలను సూపర్ ఫాస్ట్ గా లైన్ లో పెట్టేస్తున్నాడు కమల్ హాసన్. ఈక్రమంలో కమల్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ఇండియన్2.ఈ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు లోకనాయకుడు. పాతికేళ్ల క్రితం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా.. ఈ సినిమా తెరకెక్కుతుంది. 

అటు రామ్ చరణ్ తో సినిమా చేస్తూనే.. ఆ సినిమా షూటింగ్ కు లాంగ్ గ్యాప్ ఇచ్చి.. ఇండియన్2 ను పరుగులు పెట్టిస్తున్నాడు డైరెక్టర్ శంకర్. వరుసగా షూటింగ్స్ షెడ్యూల్స్ తో చాలా ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆంధ్రాలో జరిగిన ఈ సినిమా షూట్ ప్రస్తుతం ఆఫ్రికాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్ కు సబంధించి ఓ ఫోటోను లీక్ చేశారు కమల్ హాసన్. 

View post on Instagram

తాజాగా ఈ సెట్ నుంచి కమల్ హాసన్ ఓ ఫోటోని తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. వస్తాదుల్లాంటి విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో కమల్ హాసన్ ఏదో డీప్ గా డిస్కర్షన్ చేస్తున్నారు. చుట్టూ యాక్షన్ సీన్ వాతావరణం కనిపిస్తుంది. ఇండియన్ 2 యాక్షన్ టీం, చాలా వేగంగా యాక్షన్ సన్నివేశాలు షూట్ జరుగుతున్నాయి అని పోస్ట్ లో రాసుకోచ్చారు కమల్ హాసన్. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అంతా ఇండియన్ 2 అని ప్రింట్ చేసి ఉన్న బ్లాక్ టీషర్ట్స్ వేసుకున్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. కమల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తు ఇండియన్ 2 సినిమా 2023 చివర్లో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.