లోకనాయకుడు కమల్‌ హాసన్‌.. తనకు బ్లాక్‌ బస్టర్ ఇచ్చిన `విక్రమ్‌` స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. సక్సెస్‌ కోసం సేమ్‌ స్టయిల్‌ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది  

కమల్‌ హాసన్‌.. `విక్రమ్‌` సినిమాతో పూర్వ వైభవాన్ని పొందారు. ఆయన సరైన హిటే పడి కొన్నేళ్లు అవుతుంది.ఈ క్రమంలో `విక్రమ్‌` సినిమా సంచలన విజయం సాధించింది. సినిమా మేకింగ్‌ పరంగా, మ్యూజిక్‌ పరంగా, యాక్షన్‌ పరంగానూ కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత చాలా సినిమా యాక్షన్‌ పరంగా ఇదే ట్రెండ్‌ని ఫాలో అయ్యారు. దాన్ని బేస్‌ చేసుకునే చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది సక్సెస్‌ ఫార్మూలాగా మారింది. 

ఇప్పుడు అదే సక్సెస్‌ ఫార్మూలాని చాలా మంది హీరోలు ఫాలో అవుతున్నారు. అందులో కమల్‌ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన `థగ్‌ లైఫ్‌` మూవీకి అదే పంథాని కొనసాగిస్తున్నట్టు అర్థమవుతుంది. మణిరత్నం దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెండున్నర దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో `థగ్‌ లైఫ్‌` మూవీ రూపొందుతుంది. అయితే ఇందులో కమల్‌ హాసన్‌తోపాటు భారీ కాస్టింగ్‌ని ప్రకటించారు. దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారని చెప్పారు. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఇందులో ఈ ఇద్దరు తప్పుకున్నారట. స్క్రిప్ట్, పాత్రల విషయంలో సాటిస్పై గా లేని దుల్కర్‌, జయంరవి సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. వారి డేట్స్ ఇష్యూ కారణమని మరో రీజన్‌గా తెఉలస్తుంది. అయితే ఆ స్థానంలో శింబు చేరారు. ఇంటీవలే ఆయన పాత్రని పరిచయం చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. జెట్ స్పీడ్‌తో కారులో వచ్చిన శింబు లుక్‌, ఎంట్రీ అదిరిపోయింది. 

ఆయనతోపాటు అశోక్‌ సెల్వన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇందులో శింబు.. కమల్‌ హాసన్‌కి కొడుకుగా కనిపించబోతున్నారట. పెంపుడు కొడుకుగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. `విక్రమ్‌` మూవీలోనూ కొడుకుని పెంపుడు కొండుకుని చంపేస్తే వారిపై కమల్ ప్రతీకారం తీర్చుకోవడమనేదికథ. సరిగ్గా ఇందులోనూ అలాంటి కథనే ఉండబోతుందట. పైగా శింబుని కొడుకుగా నటిస్తున్నారనే వార్త మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. ఎల్లుండి ఉనంచి కొత్తషెడ్యూల్‌ ప్రారంభం కాబోతుంది. చెన్నైలో దాదాపు 17 రోజులపాటు చిత్రీకరించబోతున్నారు. ఇందులో కమల్‌ హాసన్‌, శింబు, అశోక్‌సెల్వన్‌ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. 

ప్రస్తుతం కమల్‌ హాసన్‌ `ఇండియన్‌ 2`లో వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. జులై మొదటి వారంలో థియేటర్లోకి రాబోతుంది. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు రెండుగా రాబోతుంది. `ఇండియన్ 2`తోపాటు `ఇండియన్‌ 3` షూటింగ్‌ కూడా పూర్తయ్యంది. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. ఆరు నెలల గ్యాప్‌తో దీన్ని రిలీజ్‌ చేయబోతున్నారట.