మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఏవరేజ్ గా ఆడింది. దీంతో చాలా కాలం బ్రేక్ తీసుకున్నాడు కళ్యాణ్ దేవ్. ఆ మధ్య ఓ సినిమా మొదలెట్టాడు. 'మీనాక్షి' అనే వర్కింగ్ టైటిల్ కూడా అనుకున్నారు.

ఓ నలభై శాతం సినిమా షూటింగ్ చేసి.. మధ్యలోనే ఆపేశారు. బడ్జెట్ సమస్యో మరొకటో క్లారిటీ లేనప్పటికీ సినిమా మాత్రం ఆగిపోయింది. ఇది ఇలా ఉండగా.. లేటెస్ట్ గా మరో సబ్జెక్ట్ ను కళ్యాణ్ దేవ్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ నేపధ్యంలో సాగే డ్రామా అని దీనికి 'కండోమ్ ఫ్యాక్టరీ' అనే టైటిల్ అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

పులివాసు అనే డైరెక్టర్ ఈ సినిమాకి పని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 1980ల కాలంలో కండోమ్ ఫ్యాక్టరీలో హీరో పని చేయడం వంటి లైన్ తో సినిమా ఉంటుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు కళ్యాణ్. అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ సినిమా అయినా మొదలుపెడతాడా..? లేక మధ్యలోనే ఆపేస్తాడో చూడాలి. కానీ సినిమాకి 'కండోమ్ ఫ్యాక్టరీ' అనే టైటిల్ పెట్టడమనేది బోల్డ్ మూవ్ అనే చెప్పాలి. మరి సినిమాలో కళ్యాణ్ దేవ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి!