టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ లో ఒకరైన ముద్దగుమ్మ కాజల్ అగర్వాల్. యువ హీరోయిన్స్ ఎంత మంది వస్తున్నా కూడా అమ్మడి అందానికి సరైన పోటీ ఎవరు ఇవ్వడం లేదు. చందమామలా ఎప్పటికి అదే లెవెల్లో మార్కెట్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే ఎన్నాళ్లని ప్లాపులతో కెరీర్ ని నెట్టుకొస్తోంది. 

గత ఏడాది నుంచి కాజల్ వెనక్కి తిరిగి చూసుకుంటే సరైన విజయమే లేదు. అ! సినిమా తప్పితే పేరుతెచ్చిన సినిమాలేమి లేవు. అయితే ఇప్పుడు సీత సినిమా ద్వారా అమ్మడు బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ప్రస్తుతానికి సినిమాపై పెద్దగా బజ్ ఏమి లేదు. కాజల్ గత సినిమాలు ఎమ్మెల్యే - కవచం సినిమాలు బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. 

అయితే హ్యాట్రిక్ డిజాస్టర్ కాకుండా మినిమమ్ హిట్ కొట్టాలని అమ్మడు సీత ప్రమోషన్స్ డోస్ పెంచింది. అయితే  రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజయితే గాని క్లారిటీ వచ్చేలా లేదు. టీజర్ - ట్రైలర్స్ ని బట్టి కాజల్ పాత్రే సినిమాలో కీలకమని క్లియర్ గా తెలుస్తోంది. మరి కాజల్ గ్లామర్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.