Asianet News TeluguAsianet News Telugu

హనీమూన్ కి కాజల్ ఎక్కడికి వెళ్లిందంటే..

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది. భర్త గౌతమ్ కిచ్లుతో ఆమె హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లడం జరిగింది. మాల్దీవ్స్ లోని అందమైన సాగర తీరంలో కాజల్ హనీమూన్ ని ఆస్వాదిస్తోంది. ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.  రెడ్ కలర్ బీచ్ వేర్ ధరించిన కాజల్ చాలా సెక్సీ గా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. అందమైన మాల్దీవ్స్ లో కోరుకున్న భర్తతో అనుక్షణం ఆస్వాదిస్తున్న ఆమెకు బెస్ట్ విషెష్ చెప్తున్నారు.  
 

Kajal Aggarwal And Gautam Kitchlu Are Honeymooning In Maldives jsp
Author
Hyderabad, First Published Nov 8, 2020, 6:00 PM IST

రీసెంట్ గా వివాహం చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది. భర్త గౌతమ్ కిచ్లుతో ఆమె హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లడం జరిగింది. మాల్దీవ్స్ లోని అందమైన సాగర తీరంలో కాజల్ హనీమూన్ ని ఆస్వాదిస్తోంది. ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.  రెడ్ కలర్ బీచ్ వేర్ ధరించిన కాజల్ చాలా సెక్సీ గా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. అందమైన మాల్దీవ్స్ లో కోరుకున్న భర్తతో అనుక్షణం ఆస్వాదిస్తున్న ఆమెకు బెస్ట్ విషెష్ చెప్తున్నారు.  

ఇక కరోనా నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహాన్ని జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ  ప్రస్తుతం అనేక చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత కూడా సినిమాలలో నటిస్తానని ఇప్పటికే చెప్పింది. అటు సంసారం.. ఇటు వృత్తి రెంటికీ సమ ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటోంది. ఇక ‘లక్ష్మి కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాల తార కాజల్ ‘మగధీర’ చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి హిట్‌ను అందుకుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య, కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. అలాగే మంచు విష్ణుతో పాటు మోసగాళ్లు మూవీలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. నవంబర్ 9నుండి ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. అలాగే మిగతా చిత్రాల షూటింగ్స్ కూడా పునఃప్రారంభం కానున్నాయి. దీనితో కాజల్ ఈ గ్యాప్ లో హనీమూన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios