సౌత్ సీనియర్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కాజల్ పేరు టాప్ లో ఉంటుంది. 2004 నుంచి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ చందమామ నిత్యం ఎదో ఒక సినిమాతో బిజీగా ఉంటోంది. అయితే అప్పుడపుడు హీరోయిన్స్ కెరీర్ లో ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే ఆ కిక్ మాములుగా ఉండదు. 

కాజల్ నుంచి కూడా ఇప్పుడు అలాంటి సీన్ దర్శనమివ్వనుంది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా కాజల్ కి ఇప్పుడు విజయం చాలా అవసరం. అయితే ఆగస్ట్ 15న అమ్మడు రెండు సినిమాలతో తన లక్కుని పరీక్షించుకోనుంది. జయం రవితో కలిసి నటించిన కామెడీ తమిళ్ డ్రామా రిలీజ్ కు రెడీ అయ్యింది. 

ఇక శర్వానంద్ తో నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ రణరంగం కూడా విడుదలకు సిద్ధమైంది. రెండు సినిమాలు ఆగస్ట్ 15న రిలీజ్ కానున్నాయి. దీంతో బేబీ కెరీర్ కి ఆ ఒక్కరోజే కీలకం కానుంది. సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గుతున్న తరుణంలో అమ్మడు ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.