పేద కళాకారులకు మనం సైతం సాయం, కాదంబరి కిరణ్ ఆపన్న హస్తం
ఎన్నో ఏళ్ళుగా మనంసైతం ఫౌండేషన్ ద్వారా పేదవారిని ఆదుకుంటున్నాడు నటుడు కాదంబరి కిరణ్. తాజాగా ఆయన మరికొందు పేద కళాకారులను ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కించాడు.
చాలా ఏళ్ళుగా మనం సైతం ఫౌండేషన్ నడుస్తోంది. సినీ నటుడు కాదంబరి కిరణ్ ఆద్వార్యంలో గత కొన్నాళ్ళుగా.. సినీ పరిశ్రమలోని పేద కళాకారులు, కార్మికులకు, అవసరాల్లో ఉన్న నిరుపేదలకు అండగా ఉంటోంది మనం సైతం. దాదాపు పదేళ్లుగా నటుడు, దర్శకుడు కాందంబరి కిరణ్ ఈ సేవ చేసతున్నారు.రీసెంట్ గా కూడా పావలా శ్యామలకు ఆయన సాయం అందించడం చూశాం. ఈక్రమంలో తాజాగా ఒకేసారి పలువురు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు, బయటి వ్యక్తులకు ఆర్ధిక సాయం అందించారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెయిర్ స్టయిలిస్ట్, సీనియర్ నటి రంగస్థలం లక్ష్మికి మనం సైతం ఫౌండేషన్ నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం అందచేశారు కాదంబరి కిరణ్. అలాగే ఎనుముల విదిష అనే బాలికకు ముక్కుకు సంబంధించిన ఆపరేషన్ కోసం 25,000 ఆర్థిక సాయం చేశారు. వీటితో పాటు సినీ ఆర్టిస్ట్, డాన్సర్ సూరేపల్లి చంద్రకళ చదువుల్లో కూడా రాణిస్తుండటంతో ఆమె ఉన్నత చదవుల కోసం ఇంగ్లాండ్ వెళ్లడానికి సాయం కోరగా కాదంబరి కిరణ్ 25,000 రూపాయలు అందించారు. ఇలా పలువరు కష్టాల్లో ఉన్నవారిని మనం సైతం ద్వారా ఆదుకున్నారు కాదంబరి.
ఇక రీసెంట్ గా చాలా దీనవస్తలో ఉన్న టాలీవుడ్ సీనియర్ నటి పావల శ్యామల కు ఆర్ధిక సాయం చేయడం అందరికి తెలిసిందే. ఆశ్రమంలో కూతురుతో ఆమె పడుతున్న కష్టాల గురించి తెలుసుకొని కాదంబరి కిరణ్ మనం సైతం నుంచి 25,000 ఆర్థిక సాయం అందించారు. ఇక వాటికి తోడు.. రీసెంట్ గా మరికొంత నగదును ఆమెకు అందించారు కాదంబర. ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్మికులుగా ఉంది.. చాలీ చాలని జీతంతో కాలం వెల్లదీస్తున్నవారికి మనం సైతం ద్వారా ఆపన్న హస్తం అందిస్తున్నారు కాదంబరి కిరణ్.