మెగా హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారిద్దరి స్నేహాన్ని చూపించే ఓ అద్భుతమైన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మధ్య ఎంతటి బలమైన స్నేహముందో ‘ఆర్ఆర్ఆర్’తో బయటపడింది. ఆర్ఆర్ఆర్ RRRలోనూ వీరిద్దరి మైత్రీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే చరణ్ బర్త్ డే సందర్బంగా తారక్ స్పెషల్ గా విష్ చేశాడు. ఆర్ఆర్ఆర్ సెట్ లో వీరిద్దరూ స్నేహంగా మెదిలిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు ఎన్టీఆర్. ‘రామ్ చరణ్ నువ్వు ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి. ఎల్లప్పుడూ నా పక్కన ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. మన స్నేహంలో మరిన్ని జ్ఞాపకాలను సృష్టించుకుందాం. నీకోసం ఈ చిరు జ్ఞాపకం’ అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో అర్థమవుతోంది. అలాగే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ రామ్ చరణ్, ఎన్టీఆర్ స్నేహాన్ని వివరించారు. అయితే చరణ్ ప్రతి బర్త్ డేకు ఎన్టీఆర్ ఎలా హాజరయ్యేవాడో తెలిపాడు. అలాగే ప్రతి అకేషన్స్ కు కూడా చరణ్, ఎన్టీఆర్ కలుస్తూనే ఉంటారని తెలిపారు. మరో ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ తన ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ బయట తారక్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం’ RRR బాక్సాఫీస్ రికార్డులనున తిరగరాస్తోంది. మొదిటి రోజూ రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా సత్తాను చాటింది. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. తారక్, చరణ్ ఇద్దరూ ఉద్యమ కారులలైన కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను పోషించారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ (Alia Bhatt) కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. డీవీవీ దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు.
