టాలీవుడ్ సెలబ్రెటీలందరు ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఎవరి స్టయిల్లో వారు సరికొత్త సర్ ప్రైజ్ లతో అభిమానులకు మంచి కిక్కిస్తున్నారు. వీలైనంత వరకు చాలా మంది వారి సినిమాలకు సంబందించిన న్యూస్ లను వదులుతున్నారు. మెయిన్ గా పోస్టర్స్ టీజర్స్ వస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. 

ఉద్యమ వీరులైన అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రలతో రెడీ అవుతున్న RRR నుంచి ఏదైనా న్యూస్ ను తారక్ చెబుతాడని అంతా భావించారు. కానీ అభిమానులను నొప్పించకుండా తన వారసుడిని ఫ్రీడమ్ ఫైటర్ గెటప్ లో చక్కగా రెడీ చూసి చూపించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గా రెడీ అయిన తారక్ తనయుడు అభిరామ్ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తున్నాడు.

ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఆ ఫొటో నిమిషాల్లో వైరల్ గా మారింది. తారక్ తనయుడు ఫ్యూచర్ లో ఇలాంటి పాత్రలో క్లానిపిస్తే బావుండు.. తధాస్తు! 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#JaiHind

A post shared by Jr NTR (@jrntr) on Aug 14, 2019 at 10:16pm PDT