Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య ‘రూలర్‌’లో ఎన్టీఆర్ ‘టెంపర్’షేడ్స్?

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. 

jr Ntr's superhit Temper Shades in Balakrishna's Ruler?
Author
Hyderabad, First Published May 14, 2019, 9:26 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈనెల్లోనే అఫీషియల్ గా పూజతో  ప్రారంభమయ్యే ఈ చిత్రం జూన్‌ నుంచి షూటింగ్ మొదలు కానుంది. సి.కల్యాణ్‌ నిర్మించే ఈ చిత్రం కోసం ‘రూలర్‌’ అనే టైటిల్‌  అనుకుంటున్నట్లు సమచారం. రీసెంట్ గా సి.కల్యాణ్‌ ఈ టైటిల్‌ని ఫిలిం ఛాంబర్‌లో నమోదు చేయించారు. 

బాలకృష్ణ పోలీస్‌ అధికారిగా కనిపించే ఈ చిత్రం కథ విభిన్నంగా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. బాలయ్య గతంలోనూ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. దాంతో వాటిని దాటేలా ఈ చిత్రం ఉండాలని ఆయన భావిస్తున్నాడు. పూర్తిగా మాస్ కు నచ్చే నేరేషన్ తో నడిచేలా రవికుమార్ దీన్ని తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా జూ.ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రం టెంపర్ చిత్రం స్టోరీ లైన్ కు దగ్గరగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 

ఈ సినిమాలోనూ బాలయ్య ఓ అవినీతి పరుడుగైన పోలీస్ గా ఫస్టాఫ్ గా చాలా రూడ్ గా కనిపిస్తాడట. ఓ సంఘటనతో అతనిలో మార్పు వచ్చి విలన్స్ పని ఎలా పడతారనే దిసగా కథ,కథనం నడవబోతోందని చెప్తున్నారు.

కాబట్టే  ఆ పాత్ర బిహేవిరయర్ కు, దూకుడుకీ ‘రూలర్‌’ అనే పేరు సరిగ్గా సరిపోతుందని చిత్రం టీమ్ భావిస్తోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కు చోటుంది. వారు ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తారు. లెజెండ్ తర్వాత జగపతి బాబు ఈ సినిమాలో విలన్‌గా నటించనుండగా, గౌతమిపుత్ర శాతకర్ణి, జై సింహా సినిమాలకు సంగీతమందిచిన చిరంతన్ భట్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందించబోతున్నాడు. ఇదివరకు ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘జై సింహా’ మంచి విజయాన్ని అందుకుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios