ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో కనిపించాలంటే ఆ పాత్ర ఎంత గొప్పదై ఉండాలి. ఆయన్ని ఒప్పించాలంటే ఆ డైరక్టర్ కు, నిర్మాతకు ఎన్ని గట్స్ ఉండాలి. అయితే ఓ సినిమాలో గెస్ట్ రోల్ కు ఎన్టీఆర్ ఒప్పుకునేలా ఉన్నట్లు సమాచారం. ఆలోచించి చెప్తానని ఆ దర్శకుడు మాట ఇచ్చారట. 

ఎన్టీఆర్ ప్రతీ విషయం ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. కొన్ని తన కెరీర్ కు ప్లస్ అయ్యే డెసిషన్స్ తీసుకుంటే మరికొన్ని తనలోని నటుడుని ఆవిష్కరించే నిర్ణయాలుకు ప్రయారిటీ ఇస్తూంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ అలాంటి నిర్ణయం తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలుస్తోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగేంద్ర అనే దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంలో ఓ కీలకమైన అతిధి పాత్రకు గానూ ఎన్టీఆర్ ని సంప్రదించినట్లు సమాచారం. 

హీరో సినిమాలో గెస్ట్ గా కనిపించటం కన్నా ఇలా మహిళా ప్రధాన పాత్రలో నడిచే సినిమాలో కనిపించే గెస్ట్ రోల్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని ఎన్టీఆర్ భావిస్తున్నారు. సినిమాలో దాదాపు పది నిముషాలు పాటు సాగే ఈ కామియో కు సంభందించిన నేరేషన్ ఇప్పటికే ఎన్టీఆర్ విన్నారట. అయితే ఫైనల్ గా ఓ సారి మొత్తం విని తను మాత్రమే చేయగలిగే పాత్ర అయితే చేస్తానని మాట ఇచ్చారట. ఈ గెస్ట్ రోల్ లో చేయమని  ఎన్టీఆర్ సన్నిహితుడు, పి ఆర్ మహేష్ కోనేరు  స్వయంగా ఎన్టీఆర్ ని అడిగారట.

ఈ చిత్రానికి మ‌ణిర‌త్నం క్లాసిక్ టైటిల్ సఖిని ప‌రిశీలిస్తున్నారు.  ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ మొద‌లైంది. క‌ళ్యాణ్ రామ్ హీరోగా 116 సినిమా నిర్మించిన మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే హైదరాబాద్‌లో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. ఇక త్వ‌ర‌లోనే భారీ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ల‌నుంది చిత్ర‌యూనిట్.