Asianet News TeluguAsianet News Telugu

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదే

ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌  హీరోలుగా ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌). ప్రస్తుతం శరవేగంగా షూటింగ్  జరుపుకొంటున్న ఈ చిత్రం పీరియడ్‌ డ్రామాగా, బ్రిటిష్‌ కాలంలో జరిగిన కథతో దీన్ని రూపొందిస్తున్నారు. 

Jr NTR next movie with Producer KL Narayana
Author
Hyderabad, First Published Mar 8, 2019, 8:09 AM IST

ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌  హీరోలుగా ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌). ప్రస్తుతం శరవేగంగా షూటింగ్  జరుపుకొంటున్న ఈ చిత్రం పీరియడ్‌ డ్రామాగా, బ్రిటిష్‌ కాలంలో జరిగిన కథతో దీన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై అదే స్దాయిలో  భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ తదుపరి ఏ సినిమా కమిటయ్యారు..తర్వాత చేయబోయే చిత్రం ఏది అనే విషయం ఆసక్తికరం. 

అందుతున్న సమాచారం మేరకు..ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం దుర్గా ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ కు కమిటైనట్లు సమాచారం. గతంలో ఎన్టీఆర్ తో రాఖీ చిత్రం నిర్మించిన నారాయణ  గతంలో క్షణ క్షణం, హలో బ్రదర్, సంతోషం వంటి సూపర్ హిట్స్ ఇచ్చారు.  2020లో ప్రారంభమయ్యే ఈ చిత్రం డైరక్టర్ ఎవరనేది ఫైనలైజ్ కాలేదట. 

ఎన్టీఆర్ టెర్రిఫిక్ గా  ఓ స్టోరీ లైన్ చెప్పి ఓకే చేయించుకున్న కొత్త దర్శకుడుతో ముందుకు వెళ్లాలని, కొత్త తరహా చిత్రం చేయాలని నారాయణ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ సైతం త్వరలో ఈ బ్యానర్ కోసం వీలు చూసుకుని కథలు వినటం మొదలెడతారని తెలుస్తోంది.  

‘ఆర్‌ఆర్‌ఆర్‌’విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర రెండు వైవిధ్యమైన షేడ్స్‌ను కలిగి ఉంటుందని మీడియా వర్గాల సమాచారం. ఒక లుక్‌లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేయగా, మూడో షెడ్యూల్‌ కోసం ఇంకాస్త బాడీ పెంచే పనిలో ఉన్నాడట తారక్‌. క్యారక్టర్స్ డిజైన్ విషయంలో అస్సలు రాజీపడని రాజమౌళి... ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios