గోవా ఫ్లైట్ ఎక్కిన ఎన్టీఆర్, బీచ్ లో జాన్వీ తో రొమాన్స్ చేయబోతున్న తారక్, దేవర తాజా షెడ్యుల్..?
దేవర షూటింగ్ షెడ్యూల్స్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు కొరటాల శివ. ఇక తారక్, జాన్వీ మధ్య రొమాటిక్ సెషన్ ను గోవాలో ప్లాన్ చేశాడట. దాని కోసం తారక్ ఇప్పటికే గోవా చేరుకున్నట్టు తెలుస్తోంది.
దేవర షూటింగ్ షెడ్యూల్స్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు కొరటాల శివ. ఇక తారక్, జాన్వీ మధ్య రొమాటిక్ సెషన్ ను గోవాలో ప్లాన్ చేశాడట. దాని కోసం తారక్ ఇప్పటికే గోవా చేరుకున్నట్టు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న హైఓల్టేజ్ యాక్షన్ మూవీ 'దేవర'. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆమె సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక తారక్ కు విలన్ గా బాలీవుడ్ అగ్రహీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండడం విశేషం. ఈమూవీ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు కొరటాల. పక్కా ప్రాణాళకతో షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక దేవర నెక్ట్స్ షెడ్యూల్ కు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం దేవర తాజా షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ షెడ్యూల్ కోసం గోవా వెళ్లాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ కెమెరా కళ్లకు చిక్కారు. ఎయిర్ పోర్ట్ లో ఆయన కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ జాన్వీ కపూర్ తో కాంబినేషన్ సీన్లతో పాటు.. కాస్త ఘాటు రొమాన్స్ కూడా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ ఇద్దరికి సబంధించిన పాటతో పాటు... పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఇక ఈ గోవా షెడ్యూల్ ముగిసిన తరువాత టీమ్ వెంటనే కర్నాటక వెళ్లనున్నారు.. అక్కడ ఫేమస్ టూరిజం స్పాట్ అయిన గోకర్ణంలో భారీ సెట్టింగ్ లతో షూటింగ్ జరపనున్నారు. ఇలా నాన్ స్టాప్ గా షూటింగ్ ప్లాన్ చేసుకుని.. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. అనుకున్న డేట్ దేవర సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు టీమ్. ఈసినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.