తెలుగు చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న ‘జితేందర్ రెడ్డి’తో పాటు ఇతర సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి. ఈరోజు టాలీవుడ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.

ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా... ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాల దర్శకుడు విరించి వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ‘ఎవరికి చెప్పొద్దు’ వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించారు. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. 

గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచేసాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ వేడుక చాలా ఘనంగా జరిగింది. గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈవెంట్ లో నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి, యాక్టర్ రవి ప్రకాష్, హీరో రాకేష్ వర్రె, దర్శకుడు విరించి వర్మ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 


ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’.. 

ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ అందరినీ మెప్పిస్తోన్న వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2. దక్షిణాదిలోనే కాదు.. ఇండియా మొత్తంలో ఈ సిరీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షోగా నిలిచింది. ఈ విజయం ఎంత పెద్దదిగా నిలిచిందంటే ఇండియాలో ఏ ఓటీటీలో మాధ్యమంలోనైనా టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ షో సత్తా చాటింది. ఇండియాలోనే అన్ని ఓటీటీ మాధ్యమాల్లో వచ్చిన రీసెంట్ వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ నిలవటంపై షో రన్నర్ మహి వి.రాఘవ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేశారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 1, సీజన్ 2 షోలకు వచ్చిన రెస్పాన్స్‌తో మరిన్ని సీజన్స్‌కు అవకాశం ఉందన్నారు. సీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైయాయని తెలిపారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 సెట్స్ పైకి వెళుతుంది. ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్‌ వాకి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ సంస్థ కోరింది. 

‘శివమ్ మీడియా’ ఈవెంట్..

సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల నూతనంగా స్థాపించిన ‘శివమ్ మీడియా’ గురించి అందరికి తెలిసిందే. ఈరోజు నిర్మాణ సంస్థ నుండి టీజర్, సాంగ్ ను లాంచ్ చేశారు. ప్రసాద్ లాబ్స్ వేదికగా ఈ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డైరక్టర్ వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ తనకి తెలుగు అంటే చాలా ఇష్టం. ఇలాంటి ఒక heartful film, చేసినందుకు నాకు చాలా హ్యాపీ గా ఉందన్నారు. తెలుగులో సత్య సినిమాకి మాటలు అందిచిన K.N విజయ్ కుమార్, నిర్మాత K బాబు రెడ్డి, నిర్మాత సతీష్, ప్రార్థన సందీప్, హీరో అమరేష్, TFJA president TV9 లక్ష్మి నారాయణ, సినీ జోష్ రాంబాబు, ప్రొడ్యూసర్ శివ మల్లాల సతీమణి సుజాత, యాక్టర్ కార్తిక్ రత్నం, BA raju గారు అబ్బాయి శివ మాట్లాడారు.