అతి త్వరలోనే ఈ భాషల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వార్త వినగానే పాన్ ఇండియా లెవల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ లో
వరల్డ్ వైడ్ గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of Thrones - GoT) సీరిస్ కు ఉన్న పాపులారిటీ తెలిసిందే. వెబ్ సిరీస్ అంటేనే వెంటనే గుర్తొస్తుంది. అంతగా ఫేమస్ అయ్యిన ఈ సీరిస్ ఇంగ్లీష్ లో ఉండటం వలన చాలా మంది వినటమే కానీ చూడలేకపోయారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎవరైనా డబ్బింగ్ చేస్తే బాగుండును అని ఎదురుచూస్తున్నారు. అదిరిపోయే గ్రాఫిక్స్, ఆసక్తికర మలుపులతో ఉండే సిరీస్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ (House of The Dragon) ఈ మధ్యనే విడుదల అయ్యి సక్సెస్ అయ్యింది. ఇదే తరుణంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను తెలుగులో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్‌కు సంతోషం కలిగించే విషయం బయటికి వచ్చింది. తెలుగులో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది.
ఇండియాలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ఓటీటీ పలు హాలీవుడ్ సినిమాలను, సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. వాటిలో చాలా వరకు HBO కంటెంట్ ఉంటుంది. చాలా సంవత్సరాలుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్, HBO మధ్య ఉన్న ఒప్పందం కొనసాగుతూ వస్తోంది. ఆ ఒప్పందం కారణంగా HBO నెట్ వర్క్ కంటెంట్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఒప్పందంను రెన్యూవల్ చేసుకుంటూ కంటెంట్‌ను కొనసాగిస్తున్నారు. కానీ ఈసారి ఆ ఒప్పందం రెన్యూవల్ కాలేదట. దీంతో మార్చి 31 తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉండే HBO కంటెంట్ ను పూర్తిగా తొలగించారు.
ఆ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా దక్కించుకుంది. అంతేకాకుండా భారతీయ GOT ఫ్యాన్స్ కు చాలా మంచి శుభవార్త చెప్పింది. అదేంటంటే జియో సినిమాలో స్ట్రీమ్ అవ్వడమే కాకుండా.. ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ కానుంది. అతి త్వరలోనే ఈ భాషల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వార్త వినగానే పాన్ ఇండియా లెవల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యిందనేది నిజం. ఎప్పుడెప్పుడు జియో సినిమా రీజనల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయమే వైరల్ అవుతోంది.
ఇక హౌజ్ ఆఫ్ ది డ్రాగన్, ది లాస్ట్ ఆఫ్ అజ్, యుఫోరియా, ది వైట్ లోటస్, సక్సెషన్ వంటి టాప్ రేటెడ్ సిరీస్ జియో సినిమాలో చూడవచ్చు.కంటెంట్‌తో పాటు హ్యారీ పోటర్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, డీసీ యూనివర్స్ ఫ్రాంచైజీ సినిమాలు కూడా జియో సినిమాలో అందుబాటులోకి రానున్నాయి. ఐపీఎల్, మహిళల ప్రీమియర్ లీగ్ హక్కులు 2027 వరకు జియో వద్దనే ఉన్నాయి. ప్రస్తుతానికి జియో సినిమా ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ వసూలు చేయడం లేదు. అయితే ఎప్పుడైతే జనాలు ఈ సీరిస్ లను చూడటం మొదలెడతారో అప్పుడే జియో వసూళ్లు మొదలవుతాయన్నది నిజం.