దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన తొలి చిత్రం 'ధడక్‌'లో ఈ బ్యూటీ పెద్ద స్కిన్ షో చేయలేదు. కానీ బయట మాత్రం చాలా హాట్ గా కనిపిస్తుంటుంది.

మైక్రోలు, మినీ స్కర్ట్స్, పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ వీలైనంత గ్లామర్ గా కనిపించడానికి ప్రయత్నిస్తుంటుంది. అందుకే కుర్రాళ్లలో ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్.

జాన్వీకపూర్ తో బికినీ షో చేయించడానికి పక్కా ప్లాట్ ఫామ్ సిద్ధం చేస్తున్నాడు. 'దోస్తానా' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోన్న 'దోస్తానా 2'లో ఒక హీరోయిన్ గా జాన్వీకపూర్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో బికినీ ధరించాల్సి ఉంటుందని కరణ్ ముందుగానే జాన్వీకి చెప్పేశాడట.

అప్పట్లో దోస్తానా సినిమాలో ప్రియాంక చోప్రా ధరించిన గోల్డ్ కలర్ బికినీ హాట్ టాపిక్ అయింది. చాలా కాలం పాటు ఆ బికినీ గురించి చర్చలు నడిచాయి. అందుకే ఇప్పుడు సీక్వెల్ లో కూడా బికినీ సీన్స్ ఉండేలా ముందే ఫిక్స్ అయ్యారు. ఇంకా కథ పూర్తి కానప్పటికీ జాన్వీకపూర్ బికినీ కనిపించడం మాత్రం ఖాయమని తెలుస్తోంది!