తెలుగు ‘జెర్సీ’లో నాని హీరోగా చేసిన పాత్రలోకి షాహిద్ సైతం పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేశారు. ఇక తెలుగులో ‘జెర్సీ’ని రూపొందించిన గౌతమ్ తిన్ననూరి,
తెలుగులో నాని హీరోగా వచ్చి విజయం సాధించిన చిత్రం ‘జెర్సీ’.ఈ చిత్రం ఆధారంగా షాహిద్ నటించిన హిందీ ‘జెర్సీ’ రూపొందింది. ఈ సినిమాకు కూడా ‘జెర్సీ’ తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించడం విశేషం! హిందీ ‘జెర్సీ’ని మన తెలుగు నిర్మాతలయిన అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీతో కలసి అమన్ గిల్ నిర్మించడం మరో విశేషం! మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. కోవిడ్, ఇతర కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక సినిమా టాక్ విషయానికి వస్తే రివ్యూ లు, ఆడియన్స్ కూడా ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. కానీ ఈ టాక్‌కు తగ్గట్లుగా కలెక్షన్లు కనిపించడం లేదంటోంది ట్రేడ్. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే జెర్సీ ఎక్సపెక్టేషన్స్ ని అందుకోలేదు. తొలి రోజు కలెక్షన్లు కూడా చెప్పుకోదగిన రీతిలో ఏమీ లేవు.
తొలి రోజు ఇండియాలో జెర్సీ రూ.4 కోట్లకు మించి నెట్ వసూళ్లు సాధించలేదంటున్నారు. వారం ముందు రిలీజైన కన్నడ అనువాద చిత్రం కేజీఎఫ్-2కేమో శుక్రవారం రూ.12 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు వస్తాయని అంచనా . అంటే ఒక బాలీవుడ్ స్టార్ నటించిన కొత్త హిందీ మూవీ కంటే.. వారం క్రితం రిలీజైన డబ్బింగ్ మూవీకి మూడు రెట్లు వసూళ్లు ఎక్కువ అంటున్నారు. ఈ క్రమంలోనే జెర్సీకి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. తొలి రోజు కేజీఎఫ్ 2 ప్రభావం వసూళ్ల మీద బాగానే పడింది.
అలాగే స్పోర్ట్స్ డ్రామాలు హిందీ సినిమారంగానికి కొత్తకాదనే విషయం సైతం గుర్తు చేస్తున్నారు. అయితే ‘జెర్సీ’లోని ఫ్యామిలీ డ్రామా కొత్తగా కనిపించే అవకాసం ఉందంటున్నారు. తెలుగు ‘జెర్సీ’లో నాని హీరోగా చేసిన పాత్రలోకి షాహిద్ సైతం పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేశారు. ఇక తెలుగులో ‘జెర్సీ’ని రూపొందించిన గౌతమ్ తిన్ననూరి, హిందీలోనూ దర్శకత్వం వహించే ఛాన్స్ లభించగానే మరింత బాగా తెరకెక్కించే ప్రయత్నం చేసారని చెప్తున్నారు. అనిత్ మెహతా సినిమాటోగ్రఫి చాలా బాగుందని చెప్తున్నారు. విద్య పాత్రలో మృణాల్ ఠాకూర్ పరిధి మేరకు నటించింది. కరణ్ పాత్రలో రోణిత్ అలరించాడు.