Asianet News TeluguAsianet News Telugu

ఆర్య వైశ్యుల‌పై కామెంట్స్‌‌.. వివరణ ఇచ్చిన జీవిత.. ఆమె ఏం చెప్పారంటే..

ప్రముఖ నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ కీలక కామెంట్స్ చేశారు. తన కూతురు లేచిపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు. బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్ వెళ్లిందని దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Jeevitha rajasekhar Clarifies her comments on Arya vysya community
Author
Hyderabad, First Published May 19, 2022, 12:18 PM IST

ప్రముఖ నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ కీలక కామెంట్స్ చేశారు. తన కూతురు లేచిపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు. బాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్ వెళ్లిందని దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తే అవి ఎంత మంది జీవితాలను ప్రభావితం చేస్తాయో తెలుసా అని జీవిత ప్రశ్నించారు. గరుడ వేగ సినిమా వివాదం కోర్టులో ఉందన్నారు. కోర్టులో కేసు తేలకముందే ఏదో చెబుతున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తే ఏ శిక్ష అయినా వేయండి అన్నారు.

ఇక, జీవిత భర్త రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆర్య వైశ్య  సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన జీవిత.. తాను చిన్నప్పటీ నుంచి ఇంట్లో, పెద్దవాళ్ల నుంచి వింటున్న మాటను చెప్పానని తెలిపారు. ఆర్య వైశ్యులు పైసా విలువ తెలిసినవారని, ఎంతో పద్దతిగా ఖర్చు పెడతారని అన్నారు. డబ్బులకు చాలా గౌరవం ఇస్తారని.. అందులో కొంత దానం కూడా చేస్తారని అన్నారు. తాను మాట్లాడింది ఎవరినీ డౌన్ చేయడానికి కాదని.. అది వాళ్లలో గొప్ప క్వాలిటీ అని చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరిరైనా బాధపెడితే క్షమాపణ కోరుతున్నానని చెప్పారు. 

ఇక, శేఖర్ ప్రీ రిలీజ్ వేడుకలో జీవిత రాజశేఖర్ తమ కుమార్తెల గురించి చెబుతూ ఓ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమ కూతుళ్లు ఇద్దరికీ ఫుడ్ అంటే బాగా ఇష్టం అని చెప్పిన జీవిత.. శివాని పేరు స్విగ్గి వాళ్లందరికీ తెలుసు అంటూ సరదాగా తెలిపింది. అది కోమటదాని లెక్క.. డబ్బులు ఇచ్చేవరకు స్విగ్గి వాళ్ళని విడిచిపెట్టదు అంటూ జీవిత నోరు జారింది. తన కుమార్తెని ఉద్దేశించి ఆమె సరదాగా అలా కామెంట్స్ చేసినప్పటికీ.. ఆర్యవైశ్యులని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. దీనితో జీవిత కామెంట్స్ వివాదంగా మారాయి. 

దీనితో జీవిత కామెంట్స్ పై ఆర్యవైశ్యులుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కులానికి పిసినారి తనాన్ని ఆపాదించేలా జీవిత కామెంట్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.  డబ్బు విషయంలో తాము పిసినారులుగా ఉంటామని అర్థం వచ్చేలా జీవిత మాట్లాడడం దారుణం అని అంటున్నారు. 

ఇదిలా ఉండగా రాజశేఖర్, జీవిత ఇద్దరూ తరచుగా ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటారు. ఇటీవల గరుడవేగ చిత్ర ఫైనాన్సియల్ వ్యవహారం పెద్ద రచ్చగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా జీవిత మరో వివాదంలో చిక్కుకున్నారు. శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో బాగా వ్యాపించిన రోజుల్లో సెలెబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios