Asianet News TeluguAsianet News Telugu

‘జవాన్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

 నార్త్ లోనే కాదు జవాన్ సౌత్ లోకుడా భారీ వసూళ్లను దక్కించుకుంటుంది.తెలుగు,తమిళంలో కలిపి ఫుల్ రన్ లో100కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.

Jawan is going to get premiered on Netflix on SRK birthday  jsp
Author
First Published Oct 14, 2023, 7:36 AM IST | Last Updated Oct 14, 2023, 8:03 AM IST


బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్  భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘జవాన్’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర  ఏ రేంజిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సెప్టెంబర్ 7న హిందీ, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మార్నింగ్ షో తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కథ పాతదే అయినా.. షారుఖ్ ను అట్లీ ప్రజెంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ ఎలిమెంట్స్ . బాగా ఉండటంతో.. కలెక్షన్స్ కేక పెట్టించాయి అని చెప్పాలి. హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ ,మలయాళం వంటి భాషలలో ఈ సినిమా విడుదల కలెక్షన్ పరంగా భారీగానే వసూలు సాధించింది.  ఈ నేపధ్యంలో చాలా మంది ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ముంబై మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం షారూఖ్ పుట్టిన రోజైన నవంబర్ 2న  Netflix లో స్ట్రీమింగ్ కానుంది. సూపర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలను జవాన్ ని ఓటిటిలో మరోసారి చూస్తూ చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కు షారూఖ్ ఇచ్చే కానుక అని చెప్తున్నారు. సప్రైజ్ ఏంటంటే సినిమాలో రన్ టైం కోసం డిలేట్ చేసిన సీన్లను ఓటిటి వెర్షన్ లో ఆడ్ చేయనున్నారట దాంతో రన్ టైం 3గంటలు దాటనుంది.జవాన్ సుమారు 3గంటల 15నిమిషాలతో ఓటిటి లోకి రిలీజ్ కానుందని టాక్.

ఇక దర్శకుడు అట్లీ  ఆ మధ్యన ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్  చేశారు. ‘‘సరైన లెంగ్త్, ఎమోషన్స్‌తో ‘జవాన్‌’ థియేటర్‌ రిలీజ్‌ చేశాం. ఓటీటీ రిలీజ్‌కు వచ్చేసరికి ఇంకాస్త రిథమ్‌ యాడ్‌ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను దానిపైనే వర్క్‌ చేస్తున్నా. అందుకే హాలీడేకు కూడా వెళ్లలేదు. మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు.  
 
అయితే ఇప్పటికే రన్ టైమ్ ఎక్కువైందని ఫీల్ అవుతున్న సినీ లవర్స్...ఇంకా  రన్ టైం పెంచేస్తే తట్టుకోగలరా అనేది పెద్ద సమస్య..దాంతో  ఈ సినిమాను ఓటిటి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలంటోంది ట్రేడ్. అయితే ఆల్రెడీ చూసిన వాళ్లు మరో సారి చూడటం కోసమే ఈ సర్‌ప్రైజ్‌ స్క్రీమ్ లు అనేది నిజం. లేకపోతే అన్ని కోట్లు పెట్టి కొనుక్కున్న ఓటిటివాళ్లు ఏమైపోతారు?.
  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios