Asianet News TeluguAsianet News Telugu

అటు ప్రమోషన్.. ఇటు సేవా కార్యక్రమం.. భారీ విరాళం ప్రకటించిన హీరో కార్తీ..

తమిళ స్టార్ హీరో కార్తీ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. తన అన్న సూర్య లాగే తన మనసు కూడా వెన్నెలాంటిదని నిరూపిచుకకున్నాడు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే కార్తి.. సేవా కార్యక్రమాల కోసం భారీ విరాళం ప్రకటించాడు. 
 

Japan actor karthi donated for welfare activities JMS
Author
First Published Oct 30, 2023, 8:36 PM IST

తాను స్వయంగా సేవా కార్యక్రమాలు చేసేందుకు ఓ ఫౌండేషన్ రన్ చేస్తున్నాడు తమిళ హీరో కార్తి. ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి చేయూతనందిస్తున్నాడు.   తాజాగా తన కెరియర్లో 25వ సినిమాగా రూపోందుతున్న సందర్భాగా.. జపాన్ సినిమా  తనకు మరింత స్పెషల్ అవ్వాలని ఓప్రత్యేకమైన పనిచేశాడు కార్తి. తాను చేస్తున్నసమాజసేవాకార్యక్రమాలకు గాను..దాదాపు  కోటి రూపాయలకు పైగా  విరాళం ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

డీటెయిల్స్ లోకి వెళ్తే.. ప్రస్తుతం కోలీవుడ్ లో మంచి సక్సెస్ రేట్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు కార్తి. కేవలం తమిళంలోనే కాదు.. తెలుగులోనూ కార్తీకి మంచి సక్సెస్ రేట్ ఉంది.తన  25వ సినిమాగా వస్తున్న జపాన్ ను  దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే కార్తి  కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 'జపాన్' ను మరింత స్పెషల్ చేసేందుకు కార్తీ ఏకంగా కోటి 25 లక్షలు సోషల్ ఆక్టివిటీస్ కోసం డొనేట్ చేశారు. సామాజిక కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, పేదవారికి ఆహారం అందించడం కోసం ఈ భారీ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

అటుఅబిమానులు కూడా కార్తి 25వ సినిమాకోసం.. 25 రోజులు..25వేల మందికి అన్నదానం చేస్తున్నారు. అటు కార్తి కూడా తన కెరీర్లో జపాన్ 25వ చిత్రం కావడంతో 25 మంది సామాజిక కార్యకర్తలకు ఒక్కొక్కరికి ఒక లక్ష, 25 పేద పాఠశాలలకు ఒక్కొక్కరికి ఒక లక్ష, 25 ఆస్పత్రులకు ఒక్కొక్కరికి ఒక లక్ష.. మిగిలిన మొత్తాన్ని 25 రోజులపాటు 25,000 మందికి ఆహారం అందించనున్నట్లు సమాచారం. వీటిలో ఇప్పటికే 25 వేల మందికి అన్నదానం చేయాలనే కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది.

ఇక జపాన్ సినిమా విషయానికివస్తే.. ఇందులో కార్తీ దొంగగా కనిపించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు..  జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 10న తమిళ, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios