ప్రియుడితో కారులో కెమెరాకు చిక్కిన జాన్వీ కపూర్.. ముసిముసి నవ్వులు నవ్వుతూ వర్షంలో జంటగా, వైరల్ వీడియో

అతిలోక సుందరి శ్రీదేవి, బడా నిర్మాత బోనీ కపూర్ ముద్దుల కుమార్తెగా జాన్వీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తన అందచందాలతో ఈ యంగ్ బ్యూటీ క్రేజీ హీరోయిన్ గా మారింది. 

Janhvi kapoor and her boy friend Shikhar video goes viral dtr

అతిలోక సుందరి శ్రీదేవి, బడా నిర్మాత బోనీ కపూర్ ముద్దుల కుమార్తెగా జాన్వీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తన అందచందాలతో ఈ యంగ్ బ్యూటీ క్రేజీ హీరోయిన్ గా మారింది.  బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది.

జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో చాలా కాలం తన హవా కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు. 

గ్లామర్, సినిమాలు మాత్రమే కాదు పర్సనల్ మ్యాటర్స్ తో కూడానా జాన్వీ వార్తల్లో నిలుస్తోంది.  మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ ఘాటైన ప్రేమాయణమే నడుపుతోంది. చాలా సందర్భాల్లో ఈ జంట పబ్లిక్ గానే తిరిగేస్తూ మీడియా కంట పడుతున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తాజాగా మరోసారి ఈ జంట మీడియా కెమెరాకి దొరికిపోయారు. వర్షం పడుతూ కూల్ వెదర్ లో జాన్వీ కపూర్, శిఖర్ కారులో జంటగా కనిపించారు. ఇద్దరూ డిన్నర్ డేట్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. మీడియా ఫోటోలు తీస్తుండడంతో జాన్వీ కపూర్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ప్రియుడి పక్కనే కనిపించింది. ఇద్దరూ వైట్ డ్రెస్ లో మెరిశారు. 

కొన్ని రోజుల క్రితం జాన్వీ కపూర్, శిఖర్ జంటగా తిరుమలకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. దీనితో జాన్వీ, శిఖర్ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి పెళ్లి ఎప్పుడనేది ఈ జంటకే తెలియాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios