Asianet News TeluguAsianet News Telugu

#Avatar2:‘అవతార్-‌2’ తెలుగు కలెక్షన్స్ మరీ అంత డ్రాపా?

అవతార్‌ మొదటి భాగంలో పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్‌ కామెరూన్‌.. రెండో భాగంలో సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదల చేశారు. 

James Cameron #AvatarTheWayOfWater collection drop in india
Author
First Published Dec 20, 2022, 7:52 AM IST

మొత్తానికి  అవతార్‌ సినిమా సీక్వెల్‌ ‘అవతార్‌-ది వే ఆఫ్ వాటర్' థియేటర్స్‌లో వచ్చేసింది.   ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదల చేశారు. భారత్ లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాలుగు వేలకు పైగా తెరలపై విడుడలైంది. కథ, కథనం విషయంలో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ వసూళ్లలో ఈ చిత్రం దూసుకెళ్తోంది ఇప్పటికే లక్షలాది మంది ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకొని పండోరా ప్రపంచానికి చూసేసారు.  వీకెండ్ కలెక్షన్స్ దుమ్ము లేపాయి.   కేవలం మూడు రోజుల్లోనే సుమారు రూ. 3600 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారత్ లోనూ ఈ చిత్రంపై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మూడు రోజుల్లోనే మరో హాలీవుడ్ చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్’ మొత్తం కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 

అయితే సోమవారం నుంచి మాత్రం కలెక్షన్స్ డ్రాప్ మొదలయ్యినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.  హైదరాబాద్  ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో మార్నింగ్ షోకు సుదర్శన్ 35 ఎంఎంలో పది వేలు కూడా రాలేదని అంటున్నారు. పక్కన దేవిలోనూ పదిహేను వేలకు మించి రాబట్టలేకపోయిందని తెలుస్తోంది. ఇది మూడు రోజులు టికెట్లు  దొరకని అవతార్ ది వే అఫ్ వాటర్ వీకెండ్ అయ్యాక ఇదీ  పరిస్థితి. మామూలుగా ఏ సినిమాకైనా సోమవారం ఈ తరహా పరిస్థితి ఎదురవుతుంది కానీ బ్లాక్ బస్టర్స్ దానికి మినహాయింపుగా నిలిచి యాభై శాతానికి పైగానే ఆక్యుపెన్సీ చూపిస్తాయి. కానీ అవతార్ తేలిపోయింది.

  శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి వారాంతంలోనే భారత బాక్సాఫీస్ దగ్గర రూ. 131–133 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ‘డాక్టర్ స్ట్రేంజ్’ సినిమా మొత్తంగా రూ.126 కోట్ల కలెక్షన్స్ తో భారత్ లో అత్యధిక వసూలు చేసిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఆ రికార్డును‘అవతార్2’ మూడు రోజుల్లోనే బ్రేక్ చేసి మరికొన్ని రికార్డుల దిశగా ముందుకెళ్తోందనుకుంటే దెబ్బ పడినట్లే.
  
ఈ సినిమా మొదటి భాగం పదమూడేళ్ల క్రితం వచ్చినప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలిజీ అప్పుడు లేదు. అప్పుడు కథ కూడా ఆ సినిమాకు అవసరమైంది. అయితే ఈ సారి కేవలం టెక్నాలిజీని ఆవిష్కరిస్తూ చిన్న స్టోరీ లైన్ తీసుకుని మన ముందుకు వచ్చాడు.  దాంతో  ఈ సినిమాలో స్క్రిప్టు, స్క్రీన్ ప్లే అంటూ చూస్తే ఏమీ ఉండదు. ఫార్ములా రివేంజ్ స్టోరీ కనిపిస్తుంది. అయితే విజువల్స్ మన కళ్లు నమ్మలేని స్దాయిలతో ఉంటాయి. అవతార్ ని మించిపోతాయి. టైటానిక్, ఏలియన్స్, ది అబీస్, ది టెర్మనేటర్ నాటి థీమ్స్, విజువల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కనపడతాయి. అవతార్ పార్ట్ 1 లో ఆధునిక మానవుల ఆత్యాశతో.. ఎక్కడో భూమికి దూరంగా ఉన్న పండోరా గ్రహంలోని  ఓ ఆదివాశి లాంటి తెగ, వారి అడవి నివాసాలు మొత్తం ప్రమాదంలో పడతాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios