సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఫ్యాన్స్ ఆకలి మొత్తం తీర్చేశాడు. రజనీ క్లీన్ హిట్ అందుకుని చాలా ఏళ్ళు గడుస్తోంది. తలైవా బాక్సాఫీస్ పై పంజా విసిరితే చూసి మురిసిపోవాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఫ్యాన్స్ ఆకలి మొత్తం తీర్చేశాడు. రజనీ క్లీన్ హిట్ అందుకుని చాలా ఏళ్ళు గడుస్తోంది. తలైవా బాక్సాఫీస్ పై పంజా విసిరితే చూసి మురిసిపోవాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు జైలర్ చిత్రంతో ఫలించాయి. ఆగష్టు 10న విడుదలైన జైలర్ చిత్రం రజనీకాంత్ స్టామినా నిరూపించే విధంగా బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది. వారం రోజుల్లోనే ఈ చిత్రం 350 కోట్లకి పైగా వసూళ్లు సాధించి దుసుకుపోతోంది. 

జైలర్ చిత్రం విషయంలో రిలీజ్ ముందు వరకు దర్శకుడు నెల్సన్ టెన్షన్ పడుతూ ఉన్నారట. కానీ మూడు రోజుల ముందు తన టెన్షన్ ని తలైవా తగ్గించినట్లు నెల్సన్ తెలిపారు. జైలర్ చిత్రానికి తలైవా రిలీజ్ కి మూడు రోజుల ముందు చూశారు. మూవీ నేను ఊహించిన దాని కంటే 10 రెట్లు బాగా వచ్చింది. సినిమా బాగా వస్తుందని నాకు తెలుసు..కానీ ఇంత బాగా వస్తుందని ఊహించలేదు అని రజనీకాంత్ అన్నారు. ఆయన అన్న ఆ మాటే నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది అని నెల్సన్ తెలిపారు. 

జైలర్ చిత్రం మునుపటి రజనీకాంత్ సత్తా చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తోంది. విజయ్ బీస్ట్ చిత్రంతో నెల్సన్ పై కలిగిన అనుమానాలన్నీ జైలర్ తో పటాపంచలు అయ్యాయి. సినిమా ప్రారంభానికి ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఈ చిత్రానికి ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేశాం. కానీ నిర్మాతలు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. 

నెల్సన్ దిలీప్ కుమార్ కోలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ డైరక్టర్ గా మారాడు. డాక్టర్, బీస్ట్, జైలర్ ఇలా విభిన్నమైన చిత్రాలు ఆయన నుంచి వస్తున్నాయి. ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ, వసంత్ రవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఘనవిజయాన్ని మరో కారణం సంగీత దర్శకుడు అనిరుధ్ అని చెప్పక తప్పదు.