Asianet News TeluguAsianet News Telugu

‘ఆర్చీస్’ చిత్ర నటీనటులకు జాన్వీ కపూర్ అభినందనలు.. సోదరీ ఖుషీ కపూర్ కోసం స్పెషల్ నోట్

ముగ్గురు బాలీవుడ్ స్టార్‌ కిడ్స్ నటించిన తొలిచిత్రం ‘ది ఆర్చీస్’.  ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా బాలీవుడ్ సార్స్ ఈ యువ నటులను అభినందిస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ వీరిని అభినందిస్తూ ఓ పోస్ట్ పెట్టింది.   
 

Jahnvi Kapoor Congratulations to Archies Movie Team, Long Note to Sister Khushi Kapoor
Author
Hyderabad, First Published May 14, 2022, 8:02 PM IST

1960 కాలం నాటి మ్యూజిక్ బ్యాండ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు జోయా అక్తర్. ఈయన గతంలో ‘గల్లీ బాయ్’ చిత్రంతో తన దర్శక ప్రతిభను చూపారు. మరోసారి యంగ్ యాక్టర్స్ తో మ్యూజికల్ డ్రామాను తెరకెక్కించారు. ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ చాలా ఆకట్టుకుంటోంది. పోస్టర్ రిలీజ్ సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ యువ నటీనటులను అభినందిస్తున్నారు.  

ఈ చిత్రంలో మిహిర్ అహుజా, డాట్, యువరాజ్ మెండా మరియు వేదంగ్ రైనా ఈ చిత్ర తారాగణంలో కనిపించనున్నారు. వారితో పాటు దివంగత నటి శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్, సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ -జయ బచ్చన్ మనవడు అగస్త్య నంద నటిస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ కిడ్స్ అంతా ఒకే సినిమాతో తెరంగేట్రం చేయడం విశేషం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ బాలీవుడ్ స్టార్ గౌరీ ఖాన్, జాన్వీ కపూర్, అనన్య పాండే, షానయా కపూర్, అమితాబ్ బచ్చన్, మరియు కరణ్ జోహార్ పోస్ట్ లు పెట్టారు.

తాజాగా జాన్వీ కపూర్ స్పందిస్తూ..  తన సోదరితో పాటు ఆర్చీస్ మూవీ స్టార్ కాస్ట్ కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తన సోదరీ ఖుషీ కపూర్ ను ఉద్దేశించి ఇన్ స్టా గ్రామ్ లో సుధీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. ‘ఈ సందర్భంగా మీరు ప్రశాంతంగా ఉండగలరా? నేను ఉండలేను.  మీరు ఊపిరి పీల్చుకోగలరా? నాకు సాధ్యపడదు. ఇలాంటి అత్యంత ఉత్తేజకరమైన విషయాన్ని తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ఆర్సీస్ మూవీలో అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడానికి నెలల తరబడి అవిశ్రాంతంగా శ్రమించారు జోయా అక్తర్. ఒక్కో పాత్రను అత్యంత ప్రత్యేకంగా క్రియేట్ చేయడంలో జోయా అక్తర్‌ను మించిన వారు ఎవరూ లేరు."

ఇక నా సోదరి ఖుషీ కపూర్ (Khushi Kapoor) ఆన్ స్క్రీన్ పై ఎంత అందంగా ఉందో చూడటానికి ప్రపంచంతో పాటు నేనూ వేచి ఉన్నాను. చిత్ర  పోస్టర్ లో ప్రతి ఒక్కరూ మెరిసిపోతున్నారు. అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఐ లవ్ యూ ఖుషీ.. నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నా తరుఫున నీకు 10292028 హగ్స్ అండ్ కిసెస్.’ అంటూ రాసుకొచ్చింది. ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ పిల్లలు ఈ చిత్రంలో నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. పోస్టర్ కూడా ఆకట్టుకుంటుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. త్వరలో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios