కావాలని దురుద్దేశంతోనే కొందరు తన సినిమాలాంటి పోస్టర్‌ను డిజైన్  చేసారంటూ  నిఖిల్‌ సోషల్ మీడియాలో మండిపడ్డ సంగతి తెలిసిందే.  ఇంతకీ ఆ ఇంకో  ‘ముద్ర’ ఏమిటి అంటే...జగపతిబాబు ప్రధాన పాత్రలో  నటించిన చిత్రం అని తెలిసింది. బ్లాక్ మని పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిందీ చిత్రం. బ్లాక్ మనీపై పోరాటం చేసే వ్యక్తిగా ఈ చిత్రంలో జగపతిబాబు కనిపించనున్నారు. 

ఎన్.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్యూటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నట్టి కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్ పెట్టారు. లోగో కూడా నిఖిల్ సినిమాకు చేసినట్లే డిజైన్ చేసారు.  

దాంతో నిఖిల్ సినిమా అనుకుని జగపతి బాబు సినిమాకు నెటిజన్లు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.  ఓ ప్రముఖ సినిమా టికెట్ బుకింగ్ యాప్ లో ముద్ర సినిమా టికెట్లు ఆన్ లైన్ లో పెట్టడంతో  సినిమా అబిమానులు బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. కొన్ని స్క్రీన్స్ లో దాదాపు ఫుల్ అయ్యే దాకా వచ్చింది పరిస్థితి. జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ముద్ర’ చిత్రంలో మరో కీలక పాత్రలో రావు రమేష్ నటించారు. అయితే ఈ విషయాలు  ఏవీ జగపతిబాబు కు తెలియవని తెలిసింది. 

అయితే సినిమా అప్ డేట్స్ మీద అవగాహన ఉన్న నిఖిల్ ఫ్యాన్స్ ఇందులో ఏదో మతలబు,మోసం ఉందంటూ...  నిఖిల్ కు ట్విట్టర్ ద్వారా ఆధారాలతో సహా పంపించారు. దీంతో రంగంలో దిగిన నిఖిల్ నిర్మాతల టీం సదరు యాప్ తో పాటు థియేటర్ల మీద చర్యలకు ఉపక్రమించింది 

అయితే ఒకే టైటిల్ తో రెండు సినిమాలను ఎలా ఓకే చేసారనేది ఇప్పుడు పెద్ద క్వచ్చిన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ ఫిల్మ్ ఛాంబర్ లో జరుగుతుంది. ఆల్రెడీ ఉన్న టైటిల్ తో ఏ మాత్రం పోలిక ఉన్నా కూడా ఫర్మిషన్ దొరకదు. అలాంటిది ఒకే టైటిల్ తో రెండు సినిమాలు మార్కెట్ లో రావటం అనేది ఎక్కడ పొరపాటు లేదా గోల్ మాల్ జరిగిందనేది తెలియాల్సి ఉంది. 

నిఖిల్  హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముద్ర’. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. సంతోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లాస్ట్ ఇయిర్  విడుదల కావాల్సి ఉంది కానీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పూర్తికాకపోవటంతో పోస్ట్ ఫోన్  చేశారు.