Asianet News TeluguAsianet News Telugu

మీ ఇంట్లో బిడ్డగా భావించి వదిలేయండి.. కిస్సింగ్ ఫోటోస్ లీక్ పై జాక్వెలిన్ ఎమోషనల్

రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

Jacqueline Fernandez writes heartfelt note to fans and media
Author
Hyderabad, First Published Jan 9, 2022, 12:54 PM IST

రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు గాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED ) పలు మార్లు జాక్వెలిన్ కు నోటీసులు పంపింది. కానీ జాక్వెలిన్ మాత్రం కొన్నిసార్లు మాత్రమే విచారణకు హాజరైంది. రాను రాను ఈ కేసులో ఆమెపై ఆరోపణలు బలపడుతున్నాయి. 

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుని లోతుగా విచారణ చేస్తూ కూపీ లాగుతున్నారు. ఈ కేసులో నోరా ఫతేహి లాంటి ఐటెం బ్యూటీకి కూడా సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బలంగా ఉచ్చు బిగుసుకుంటోంది మాత్రం జాక్వెలిన్ కే. సుఖేష్ తో జాక్వెలిన్ సన్నిహితంగా రొమాన్స్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటి వరకు జాక్వెలిన్ తనకు, సుఖేష్ కి ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వచ్చింది. 

Jacqueline Fernandez writes heartfelt note to fans and media

కానీ ఈ ఫోటోలు లీక్ అయ్యాక ఆమెపై ఆరోపణలు బలపడ్డాయి. దీనితో జాక్వెలిన్ తీవ్ర ఇబ్బందుల్లో పండింది. సుఖేష్ తో ఘాటుగా ముద్దుల్లో మునిగితేలుతున్న ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనితో జాక్వెలిన్ పై ట్రోలింగ్ కూడా జరుగుతోంది. 

కేసు సమస్యలు ఒకవైపు ఉంటే సుఖేష్ తో ప్రైవేట్ పిక్స్ లీక్ కావడం జాక్వెలిన్ ని మానసిక వేదనలోకి నెట్టేశాయి. తాజాగా ఫోటోలు లీక్ కావడంపై జాక్వెలిన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ చేసింది. మీడియాని, అభిమానులని, నెటిజన్లని రిక్వస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. 

 

ఈ దేశం, ప్రజలు నాపై ఎప్పుడూ ప్రేమ, అభిమానం, గౌరవం చూపుతూనే వచ్చారు. నేను ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను. నేను పడుతున్న ఇబ్బందులని అభిమానులు, ఫ్యామిలీ, స్నేహితులు గమనిస్తూనే ఉన్నారు. నాపై మీకున్న నమ్మకాన్ని అలాగే కొనసాగించండి. దయచేసి నా గౌరవానికి, ప్రైవసీకి భంగం కలిగించే ఫోటోలని సర్కులేట్ చేయవద్దు. మీ ఇంట్లో వారికైతే మీరు ఇలా చేయరు కదా.. అలాగే నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ గానే భావించి ఫోటోలు వైరల్ చేయొద్దు అని జాక్వెలిన్ ఎమోషనల్ గా రిక్వెస్ట్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios