Asianet News TeluguAsianet News Telugu

జాక్వెలిన్‌ ఫోటోషూట్‌.. మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసిన ఫెమినా

బాలీవుడ్‌ ప్రేక్షకులు జాక్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ బ్యూటీ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. డిఫరెంట్‌ స్టైల్స్‌తో పాటు యునిక్‌ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌తో బాలీవుడ్‌ దివాగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది సినిమాలు చేయకపోయినా వరుసగా వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తూ సందడి చేస్తోంది జాక్వెలిన్‌.

Jacqueline Fernandez shares a cool, funky BTS of her latest shoot for the cover of a leading magazine
Author
Hyderabad, First Published Jun 17, 2020, 2:41 PM IST

బాలీవుడ్ హాట్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఇటీవల ఓ లీడింగ్ మేగజైన్‌ కవర్‌ పేజ్ మీద సందడి చేసింది. శ్రీలంకన్‌ బ్యూటీ ఫంకీ స్టైల్‌లో కనిపించిన ఈ ఫోటోకు సంబంధిచిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది ఫెమినా సంస్థ. ఈ మేకింగ్ వీడియోలో ఫోటో షూట్ సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్స్‌ తో పాటు బెస్ట్ షాట్స్‌ను రివీల్ చేశారు. ఈ షూటింగ్ లో జాక్వెలిన్‌ స్పోర్టీ లుక్‌తో పాటు గ్లామరస్ స్టైలిష్‌ లుక్‌లో సందడి చేసింది. 

బాలీవుడ్‌ ప్రేక్షకులు జాక్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ బ్యూటీ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. డిఫరెంట్‌ స్టైల్స్‌తో పాటు యునిక్‌ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌తో బాలీవుడ్‌ దివాగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది సినిమాలు చేయకపోయినా వరుసగా వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తూ సందడి చేస్తోంది జాక్వెలిన్‌. ఓ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా లైన్‌లో ఉన్నాయి. అయితే తాజాగా ఫోటో షూట్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను మ్యాగజైన్‌ తన అఫీషియల్‌ సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios