రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ ప్రభాస్ సాహో చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. సాహో టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం విదేశాల్లో ప్రభాస్, శ్రద్దా కపూర్ పై సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్స్ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. 

ఇదిలా ఉండగా మాస్ ఆడియన్స్ కోసం ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చిత్రీకరించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. కాగా ఐటెం సాంగ్ గురించి ప్రస్తుతం ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సాహో చిత్రంపై దేశం మొత్తం భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనితో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ అయితే బెటర్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

ఐటెం సాంగ్ లో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్టెప్పులేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ కిక్ చిత్రం ద్వారా జాక్వెలిన్ బాలీవుడ్ లో స్టార్ గా మారింది. ఈ స్పెషల్ సాంగ్ ని క్రొయేషియాలో చిత్రీకరించనున్నారు. 

ఇప్పటికే విడుదలైన సాహో టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా సాహో చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.