Asianet News TeluguAsianet News Telugu

`పుష్ప`లో అనసూయ లుక్‌ లీక్‌.. డిఫరెంట్‌ గెటప్‌లో `జబర్దస్త్` యాంకర్..ఫోటో వైరల్‌

అనసూయ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో కత్తిరించిన జుట్టు(షార్ట్ హెయిర్‌)లో కనిపిస్తుంది అనసూయ. బ్లూ శారీ, పింక్‌ బ్లౌజ్‌లో కాస్త లావెక్కి, చేతినిందా కడియాలతో కనిపిస్తుంది `జబర్దస్త్` యాంకర్. 

jabardasth anchor anasuya look leak in pushpa movie photo viral
Author
Hyderabad, First Published Aug 6, 2021, 3:25 PM IST

అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న `పుష్ప` చిత్రంలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది. సునీల్‌ సరసన ఆమె కనిపించనుందని, ఆమె పాత్ర నెగటివ్‌ షేడ్స్ లో సాగుతుందని గతంలో ప్రచారం జరిగింది. తాజాగా అనసూయ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో కత్తిరించిన జుట్టు(షార్ట్ హెయిర్‌)లో కనిపిస్తుంది అనసూయ. బ్లూ శారీ, పింక్‌ బ్లౌజ్‌లో కాస్త లావెక్కి, చేతినిందా కడియాలతో కనిపిస్తుంది `జబర్దస్త్` యాంకర్. 

ఆమెకి దర్శకుడు బుచ్చిబాబు ఏదో సీన్‌ వివరిస్తున్నట్టుగా ఉంది. `పుష్ప` చిత్రంలో అనసూయ లుక్‌ ఇదే అంటూ ప్రస్తుతం ఈ పిక్‌ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. అనసూయ పూర్తి భిన్నమైన గెటప్‌లో కనిపించబోతుందని తాజా లుక్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. సుకుమార్‌ దర్శకత్వంలో `పుష్ప` చిత్రం రూపొందుతుంది. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగాన్నీ క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ నెల 13న ఫస్ట్ సాంగ్‌ విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఐదుగురు సింగర్స్ పాడిన పాటని ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టాక్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios