బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాలలో ముగియనుండగా ఇంటిలో ఉన్న ఏడుగురి సభ్యుల నుండి ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు.ఇక ఈవారానికి గానూ అఖిల్, అభిజిత్, అవినాష్, హారిక మరియు మోనాల్ ఎలిమినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ కావడం జరుగుతుంది. 

ఐతే ఈ వారం హౌస్ ని వీడేది మోనాల్ అన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఇంటిలో గ్లామర్ మరియు ఎఫైర్స్ కోసమే బిగ్ బాస్ మోనాల్ ని కొనసాగితున్నాడన్న అవవాదు మొదటి నుండీ ఉంది. అఖిల్, అభిజిత్ తో ట్రై యాంగిల్ నడుపుతూ, వాళ్ళ మధ్య గొడవలు రేపుతూ మోనాల్ కాంట్రవర్సీకి కేంద్ర బిందువుగా ఉంది. ఐతే ఇంటిని మిగతా సభ్యులు కానీ, ప్రేక్షకుల నుండి ఆమెకు పెద్దగా సపోర్ట్ లేదు. ప్రతిసారి నామినేటయ్యే మోనాల్ సేవ్ కావడం కూడా ప్రేక్షకులలో అనేక అనుమానాలు రేకెత్తించింది. 

ఎన్ని విమర్శలు వచ్చినా, మోనాల్ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేస్తూ వచ్చాడు బిగ్ బాస్. నిలకడలేని మాటలని , చాడీలు చెబుతుందనే ఆరోపణలు కూడా మోనాల్ పై వచ్చాయి. ఈ వారం పాలు సేకరించే టాస్క్ లో మోనాల్ అవినాష్ ని కాలితో తన్నింది. మోనాల్ కాలితో తన్నిందని అవినాష్ ఆరోపణ చేయడం జరిగింది. మొదట కాలితోతన్నలేదన్న మోనాల్, తరువాత అనేకమార్లు తన్నానని, తన్నలేదని మాట మార్చింది. మోనాల్ ఈ ప్రవర్తన ఆమెపై మరింత వ్యతిరేకత తెచ్చిపెట్టిందని సమాచారం. దానికి తోడు మోనాల్ ఈ మధ్య అఖిల్, అభిజిత్ తో సాన్నిహిత్యంగా ఉండడం కూడా మానేసింది. దీనితో మోనాల్ పాత్ర హౌస్ లో అయిపోయిందని బిగ్ బాస్ భావిస్తున్నాడని సమాచారం.