ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. వరుస పరాజయాల్లో ఉన్న పూరికి ఈ చిత్రం కీలకం కానుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా పూరి జగన్నాథే. రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 18న ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

తాజాగా చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఊహించిన విధంగానే పూరి జగన్నాథ్ తనదైన శైలిలో రామ్ ని మాస్ లుక్ లో ప్రజెంట్ చేశాడు. తెలంగాణ యాసలో రామ్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ మాస్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం రామ్ వన్ మ్యాన్ షోలా కనిపిస్తోంది. 

ఇక హీరోయిన్స్ ఇద్దరూ గ్లామర్ షో తో రెచ్చిపోయినట్లున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో రామ్ పెర్ఫామెన్స్ పవర్ ఫుల్ గా ఉండనునట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. 'పెద్దమ్మ గుళ్లో మొక్కి చాన్నాళ్లయింది.. నా యాట నువ్వేనని మొక్కేసినా.. నువ్వే నా పొట్టేల్' అంటూ రామ్ తెలంగాణ యాసలో డైలాగులు చెబుతున్నాడు.