పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ బిజినెస్ తో సినీ ఇండస్ట్రీకి షాక్ ఇస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా యువ హీరో రామ్ కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లను అందుకుంటుందని చెప్పవచ్చు. 

ఇప్పటికే టీజర్ అండ్ ట్రైలర్స్ పై పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యాయి. అదే సినిమా బిజినెస్ కి ఉపయోగపడింది. ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ 36.50కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. సినిమా థ్రియేటికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 17కోట్ల ధర పలుకగా ఒక్క నైజంలోనే 7కోట్ల ధర పలుకడం విశేషం. ఎందుకంటే ఇది రామ్ కెరీర్ లోనే బెస్ట్ బిజినెస్ డీల్. 

మరి ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ ఏ స్థాయిలో లాభాల్ని అందిస్తుందో చూడాలి. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టవ్వాలంటే మొదటివారమే స్ట్రాంగ్ గా రాబట్టాలి. ఈ నెల 18న ఇస్మార్ట్ శంకర్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.  మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో నాభా నటేష్ - నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు.