విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ ఇటీవల బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో అతిపెద్ద చర్చకు దారితీసింది. చెప్పుకోదగ్గ కారణం లేకుండా విజయ్ దేవరకొండను బండ్ల గణేష్ టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.

ఉట్టి పుణ్యానికే ఎవరిని ఎవరూ ఏమనరు. ఒకరిని తిట్టాలన్నా, ద్వేషించాలన్నా కారణం ఉండాలి. కానీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) మాత్రం అకారణంగా విజయ్ దేవరకొండపై విరుచుకుపడ్డాడు. అతన్ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. పరిశ్రమలో తాతలు తండ్రులు ఉంటే సరిపోదమ్మా ఎన్టీఆర్ లా, మహేష్ లా, రామ్ చరణ్ లా, ప్రభాస్ లా టాలెంట్ ఉండాలి.. అంటూ ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ కి ముందు విజయ్ దేవరకొండ ఓ వేదికపై నా తండ్రి ఎవరో మీకు తెలియదు, నా అన్న ఎవరో మీకు తెలియదు.. కానీ మీరు నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారన్నారు.

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) స్పీచ్ కి బండ్ల గణేష్ ట్వీట్ కి సింక్ కావడంతో జనాలకు ఓ క్లారిటీ వచ్చింది. బండ్ల గణేష్ ట్వీట్ పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు కౌంటర్లతో సమాధానం చెప్పారు. కారణం లేకుండా బండ్ల గణేష్ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేయడని నమ్ముతున్న నెటిజెన్స్... అతడు పూరి, ఛార్మి టీంలో ఒకడు కావడం వలన బండ్ల ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని అంటున్నారు. 

పూరి జగన్నాధ్ కి అత్యంత సన్నిహితుడైన బండ్ల ఆయనతో కలిసి చాలా ఏళ్ళు ప్రయాణం చేశాడు. నిర్మాతగా ఎదిగాక పూరితో ఇద్దరు అమ్మాయిలు, టెంపర్ లాంటి చిత్రాలు నిర్మించాడు. హీరోయిన్ ఛార్మితో సన్నిహితంగా ఉంటున్న పూరి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడనే అసహనం బండ్లలో ఉంది. ఈ విషయం చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుక వేదికగా బయటపడింది. పూరి భార్య లావణ్య, కొడుకు ఆకాష్ పై ప్రేమాభిమానాలు చాటుకున్న బండ్ల గణేష్, పూరిని మాత్రం విమర్శించాడు. ఛార్మీకి పరోక్షంగా చురకలు వేశాడు. 

ఇక లైగర్(Liger) ప్రాజెక్ట్ ఓకే అయినప్పటి నుండి పూరి,ఛార్మి టీంలో ఒకడిగా విజయ్ దేవరకొండ మారారు. ఈ ముగ్గురు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఈ కారణంగానే లైగర్ విడుదల కాకుండానే జనగణమన అనే మరో భారీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇదే విజయ్ దేవరకొండను బండ్ల గణేష్ ద్వేషించడానికి కారణమై ఉండవచ్చు అనేది కొందరి భావన. పూరి కొడుకు ఆకాష్ కెరీర్ పట్టించుకోవడం లేదని ఓపెన్ గానే చెప్పిన బండ్ల గణేష్... ఆయనతో వరుస చిత్రాలు చేస్తున్న విజయ్ దేవరకొండను ద్వేషిస్తూ ఉండవచ్చు. అదే సమయంలో ఛార్మితో పాటు విజయ్ దేవరకొండ స్నేహం కారణంగా పూరి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని బండ్ల భావించవచ్చు.