కరోనా దెబ్బతో ధియెటర్లు మూతపడడంతో  ఓటీటీ వేదికగా సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్లు ముందుకు వస్తున్నారు. అయితే వరస పెట్టి వి, నిశ్శబ్దం, ఒరేజ్ బుజ్జిగాడు వంటి సినిమాలు ఓటీటిలో డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ...కొత్త టెన్షన్ మొదలైంది. ఓటీటి వారు..సినిమాలను అంతంత రేటు పెట్టి కొనటానికి ఆసక్తి చూపటం లేదు.  మరోప్రక్క ఈ నెల 15 వ తేదీ నుంచి థియోటర్స్ ఓపెన్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్  చిత్రం పరిస్దితి ఏంటన్నది తేలటం లేదని సమాచారం. ధైర్యం చేసి ఓటీటీ వేదికగా రిలీజ్ చేద్దామా లేక, థియోటర్ లో రిలీజ్ చేద్దామా అనే తెగని ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. 
 
వాస్తవానికి ఈ సినిమాని మే01 న రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు. కానీ కరోనా వలన వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ తో ఒప్పందం చేసుకునేందుకు రెడీ అయ్యారు.  " పే పర్ వ్యూ" పద్ధతిలో సినిమాని అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే సాయి తేజ మాత్రం థియోటర్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఓటీటి ఎందుకు అని అంటున్నాడట. ఏ హీరోకయినా తన సినిమా పెద్ద తెరపై రిలీజ్ అయితే చూసుకోవాలనే ఉంటుంది. అయితే ఓటీటి అయితే మినిమం ఇంత రేటు అని వస్తుంది. 

అదే థియోటర్ రిలీజ్ ఇప్పుడున్న పరిస్దితుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణాలో థియోటర్స్ ఓపెన్ చేయబోతున్నా..ఆంథ్రాలో మాత్రం కష్టమే అంటున్నారు. పోనీ ఓపెన్ చేసినా 50 శాతమే ఫిల్ చేయాలి. అలా చేయాలంటే గిట్టు బాటు కాదు. సరే అనుకుని ముందుకు వెళ్దామనుకున్నా జనం ఏ మాత్రం వస్తారో లేదో తెలియదు. ఇలా రకరకాల సమస్యలు థియోటర్ రిలీజ్ చుట్టూ ఉన్నాయి. సాయి తేజ వంటి హీరో సినిమా థియోటర్ రిలీజ్  చేస్తే పరిస్దితి ఏమిటనేది క్లియర్ గా అర్దమవుతుంది అని  ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. అయితే ధైర్యంగా సాయి తేజ నిర్మాతలు... పిల్లి మెల్లో  గంట కడతారా అనేది ప్రశ్నార్దకమే. ఎందుకంటే సినిమా అనేది కోట్లతో కూడిన వ్యాపారం. 

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుంది. పండగ చేసుకో లాంటి సినిమా తరవాత సాయి తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.