Asianet News TeluguAsianet News Telugu

సమంత మిడిల్ ఫింగర్ చూపించడం కరెక్టేనా..?

తన భర్తతో కలిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తోన్న సమంత అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఆమె సెమీ బికినీ వేసుకొని తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సమంత పెళ్లైన తరువాత ఇలాంటి బట్టలు వేసుకోవడం పట్ల నెటిజన్లు ఆమెను దుయ్యబట్టారు.

Is Samantha's Middle Finger Act Correct?
Author
Hyderabad, First Published Sep 28, 2018, 12:23 PM IST

తన భర్తతో కలిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తోన్న సమంత అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఆమె సెమీ బికినీ వేసుకొని తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సమంత పెళ్లైన తరువాత ఇలాంటి బట్టలు వేసుకోవడం పట్ల నెటిజన్లు ఆమెను దుయ్యబట్టారు.

సమంతని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. వీటిపై స్పందించిన సమంత.. '''పెళ్లైన తరువాత నేను బతకాలో చేబుతామనుకుంటున్న మీ అందరికీ'' అంటూ మిడిల్ ఫింగర్ చూపిస్తున్న ఫోటోని షేర్ చేసి 'థాంక్యూ' అని పోస్ట్ చేసింది. 

సమంత లాంటి అగ్ర తార, అక్కినేని ఇంటి కోడలి నుండి ఇటువంటి సమాధానం ఊహించని నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సమంత చేసిన యాక్ట్ కరెక్ట్ అంటూ ఆమె అభిమానులు సపోర్ట్ చేసినప్పటికీ కొందరు మాత్రం ఆమె ఇలా చేయడం తప్పని అంటున్నారు. నిజానికి సమంత సోషల్ మీడియాలో చాలా చలాకీగా ఉంటుంది. అభిమానులతో సరదాగా మాట్లాడుతూ తన ప్రేమని పంచుతుంటుంది.

కానీ సోషల్ మీడియాలో కొందరు ఆమె వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలో చెప్పడం నచ్చని సమంతఇంత వైల్డ్ గా రియాక్ట్ అయిందని తెలుస్తోంది. కానీ ఇప్పుడు సమంత చేసిన యాక్ట్ కారణంగా ట్రోలింగ్ ఆగే ఛాన్స్ తగ్గి ఆమెని మరింతగా దూషిస్తున్నారు. కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించి నీ కుటుంబ పరువు కూడా తీస్తున్నావంటూ ఆమెని విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.  

సంబంధిత వార్త.. 

పెళ్లైనా.. ఈ బట్టలేంటి..? సమంతపై నెటిజన్లు ఫైర్!

ట్రోలర్స్ కి సమంత వార్నింగ్!

Follow Us:
Download App:
  • android
  • ios