కెజిఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కలవడం ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రశాంత్ నీల్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లి స్వయంగా అల్లు అర్జున్ ని కలిశారు. వీరి మధ్య కాసేపు చర్చల జరుగగా.. ప్రశాంత్ నీల్ బయటికి వచ్చి వెళ్లిపోయారు. అనంతరం భవనం పై నుండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అభివాదం చేశారు. 


ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ భేటీ నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రశాంత్ నీల్ తో తమ హీరో ప్రాజెక్ట్ ఒకే అయ్యిందని అభిప్రాయానికి వచ్చేశారు. పుష్ప, కొరటాల శివ మూవీ అనంతరం.. అల్లు అర్జున్ చేయబోయే మూవీ ప్రశాంత్ నీల్ తోనే అని బన్నీ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. 

మరోవైపు ప్రశాంత్ నీల్.. ప్రభాస్, అల్లు అర్జున్ లతో ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని కూడా పుకార్లు నడుస్తున్నాయి. గతంలో దీనిపై కొన్ని కధనాలు రాగా... అల్లు అర్జున్ ని ప్రశాంత్ నీల్ కలవడం వారి పుకార్లకు బలం చేకూర్చుతుంది. 

అలాగే ఇది కేవలం మర్యాదపూర్వక కలయిక కూడా కావచ్చు. ఒక వేళ ప్రశాంత్ నీల్ తన వద్ద ఉనన్ కథను అల్లు అర్జున్ కి చెప్పడానికి వచ్చి ఉండవచ్చు. వీరిద్దరి భేటీ వెనుక అసలు కారణం ఏమిటో తెలియదు. ఫ్యాన్స్ మాత్రం తమకు నచ్చిన ఊహాగానాలు చేసుకుంటూ... ఆనంద పడుతున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తే బాగుండు.