Asianet News TeluguAsianet News Telugu

#Premalu: రాజమౌళి కొడుకు చేతికి 'ప్రేమలు' రైట్స్?, తెలుగు రిలీజ్ డేట్ ఇదే

ప్రేమలు  చిత్రం డబ్బింగ్ చేస్తారా, రీమేక్ చేస్తారా అనేది నిర్మాతలకు డైలమోగా మారింది.  ఈ క్రమంలో డబ్బింగ్ చేసి ..

Is it a safe bet to dub Premalu in Telugu? jsp
Author
First Published Feb 25, 2024, 10:18 AM IST

మళయాళంలో హిట్టైన భ్రమయుగం చిత్రం ఈ శుక్రవారం రిలీజైంది. ఇప్పుడు మరో మళయాళ సూపర్ హిట్ తెలుగులోకి రాబోతోంది. అదే ప్రేమలు చిత్రం. గిరీష్ ఏడీ దర్శకత్వంలో రూపొందిన  ఈ సినిమా 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది.   ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా  ఫస్ట్ వీక్ లోనే 6 కోట్ల రూపాయల వసూళ్లను సాధించగా ఇప్పటి దాకా 30 కోట్ల వరకు కలెక్షన్స్ పైగా వచ్చాయి. దాంతో మనవాళ్ల అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది. అలాగే ఈ సినిమాకు సంభందించి మరో ఇంట్రస్టింగ్  విషయం ఏంటంటే ఈ మలయాళ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే నడవటం.

దాంతో మనవాళ్లు ఈ సినిమా చూడటానికి థియేటర్స్ దగ్గర క్యూలు కడుతున్నారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ప్రేమలు చూసిన వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రాస్తున్నారు. మాట్లాడుతున్నారు. చాలా సింపుల్ క్యూట్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హైదరాబాద్ లో కంటిన్యూ షోలు పడుతున్నాయి. ఓ ప్రక్కన  మమ్ముట్టి భ్రమ యుగం ,మరో ప్రక్క ప్రేమలు చూడటమే వీకెండ్ లో పనిగా పెట్టుకున్నారు కుర్రకారు. ఈ నేపధ్యంలో ప్రేమలు  చిత్రం డబ్బింగ్ చేస్తారా, రీమేక్ చేస్తారా అనేది నిర్మాతలకు డైలమోగా మారింది.  ఈ క్రమంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

స్టార్ డైరక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ చిత్రాన్ని చూసి ముచ్చటపడి మాట్లాడి రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ పనులు స్పీడుగా పూర్తి చేసి , మార్చి 8 రిలీజ్ పెడుతున్నారని చెప్తున్నారు.   హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నల్సేన్ కె. గఫూర్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. క్లీన్ కామెడీ,  యూత్ ఫుల్ కంటెంట్ తో ఉన్న ఈ సినిమా తెలుగులోనూ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios