Asianet News TeluguAsianet News Telugu

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సమంత... ఒక్కో సినిమాకు అంత అడుగుతుందా!


సమంత రెమ్యూనరేషన్ పై ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. అమ్మడు భారీగా పెంచేశారట. మరి సమంత ఒక్కో సినిమాకు ఎంత డిమాండ్ చేస్తుందో చూద్దాం... 
 

is heroine samantha hikes her remuneration ksr
Author
First Published Mar 19, 2024, 1:19 PM IST

సమంత పరిశ్రమకు వచ్చి 14 ఏళ్ళు అవుతుంది. ఆమె మొదటి చిత్రం ఏమాయ చేసావే 2010లో విడుదలైంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్. అక్కడ నుంచి సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో సమంత జతకట్టింది. అటు కోలీవుడ్ లో కూడా సత్తా చాటింది. డిజిటల్ సిరీస్ల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 భారీ విజయం సాధించింది. ఈ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. 

కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతున్నప్పటికీ సమంత వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. హీరో నాగ చైతన్యను వివాహం చేసుకోగా మనస్పర్థలతో విడిపోయారు. 2021లో సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకింది. ఏడాదిన్నర కాలంగా వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటుంది. చికిత్స అనంతరం కొంత కోలుకున్న సమంత సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ పూర్తి చేసింది. గత ఏడాది సమంత నటించిన శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదలయ్యాయి. 

సమంత చేతిలో కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. ఆమె విరామం తీసుకున్న నేపథ్యంలో గ్యాప్ వచ్చింది. అయితే సమంత రెమ్యూనరేషన్ పెంచాశారనే ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న సిటాడెల్ సిరీస్ కి సమంత రూ. 10 లక్షలు వరకు తీసుకుందట. అలాగే ఇప్పుడు తన వద్దకు వస్తున్న ప్రాజెక్ట్స్ కి రూ. 6 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. ఒక్కో యాడ్ కి సమంత రూ. 1.5 కోట్లు తీసుకుంటుందని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ వైరల్ గా మారింది. 

సమంతకు లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్ ఉంది. అత్యధిక హిట్ పెర్సెంటేజ్ ఉన్న హీరోయిన్. కాబట్టి నిర్మాతలు ఆమె అడిగినంత ఇస్తారు అనడంలో సందేహం లేదు. ఇటీవల సమంత హెల్త్ పాడ్ క్యాస్ట్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఎపిసోడ్ గా ఆటో ఇమ్యూనిటీ సమస్య మీద ఎక్స్పర్ట్ తో మాట్లాడారు. పలు సలహాలు సూచనలు ఇచ్చారు. సమంత హెల్త్ పాడ్ క్యాస్ట్ వైరల్ అయ్యింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios