Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య - బోయపాటి.. టార్గెట్ ఫిక్సయ్యారు!

టాలీవుడ్ లో హీరో డైరెక్టర్ కాంబినేషన్ పై ఎలాంటి అంచనాలు ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కాంబినేషన్ సెట్ అయితే అక్కడే సినిమాకు లెక్కలేనంత ప్రమోషన్స్ చేకూరుతుంది. నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లెజెండ్ - సింహ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. 

intresting update on balakrishna boyapati film
Author
Hyderabad, First Published Sep 27, 2018, 2:34 PM IST

టాలీవుడ్ లో హీరో డైరెక్టర్ కాంబినేషన్ పై ఎలాంటి అంచనాలు ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కాంబినేషన్ సెట్ అయితే అక్కడే సినిమాకు లెక్కలేనంత ప్రమోషన్స్ చేకూరుతుంది. నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లెజెండ్ - సింహ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. 

ఇకపోతే మరోసారి ఈ జోడి అదే తరహాలో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకునేందుకు రానుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ముందే కథను కూడా సిద్ధం చేసిన బోయపాటి కొందరి నటీనటులను కూడా ఫైనల్ చేశాడు. ప్రస్తుతం బోయపాటి రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్యతో చేయబోయే సినిమా షెడ్యూల్ ప్లాన్ కూడా సెట్ అయినట్లు సమాచారం. 

70 రోజుల్లోగా సినిమాను పూర్తి చెయ్యాలని బాలయ్య దర్శకుడితో ఇటీవల చెప్పినట్లు సమాచారం. ఎందుకంటే త్వరలో ఎన్నికలు వస్తుండడంతో ప్రచారంలో పాల్గొనాలి కాబట్టి ముందుగానే ఎన్టీఆర్ సినిమాతో పాటు ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తికి చేసుకుంటే బెటర్ అని బోయపాటికి వివరించినట్లు టాక్. ఇక బోయపాటి కూడా అందుకు తగ్గటుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తోంది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios