Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఒకెత్తయితే అతడు మరో ఎత్తు.. వరల్డ్ క్లాస్..!

ప్రస్తుతం దేశం మొత్తం సినీ అభిమానులు ఎదురుచూస్తున్న ఏకైన చిత్రం సాహో. అన్ని భాషల్లోని ప్రభాస్ అభిమానులు సాహో చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

interesting update on Saaho music
Author
Hyderabad, First Published Jul 5, 2019, 5:57 PM IST

ప్రస్తుతం దేశం మొత్తం సినీ అభిమానులు ఎదురుచూస్తున్న ఏకైన చిత్రం సాహో. అన్ని భాషల్లోని ప్రభాస్ అభిమానులు సాహో చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రభాస్ మునుపెన్నడూ చూడని యాక్షన్ లుక్ లో కనిపిస్తున్నాడు. భారీ ఛేజింగ్ సన్నివేశాలు, హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గని విధంగా ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ కనువిందు కలిగిస్తాయని టాక్. 

ఇలాంటి భారీ చిత్రానికి సంగీతం కూడా చాలా కీలకం టీజర్ ని ఆల్రెడీ విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా పాటల సందడి కూడా మొదలు పెట్టింది. 'సైకో సయ్యాన్' అంటూ సాగే సాంగ్ ప్రోమోని శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో శ్రద్దా కపూర్ గ్లామర్ లుక్ లో మతి పోగొడుతుండగా.. ప్రభాస్ సాంగ్ బీట్ కు తగ్గట్లుగా స్టెప్పులేస్తున్నాడు. 

పూర్తి లిరికల్ సాంగ్ ని ఈ నెల 8న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి తనిష్క్ సంగీతం అందిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ సంగీతం మాత్రం జిబ్రాన్ అందిస్తుండడం విశేషం. బ్యాగ్రౌండ్ సంగీతానికి సంబంధించి చిత్ర యూనిట్ ఆసక్తికర అప్డేట్ అందించింది. సాహో యాక్షన్ చిత్రాలకు బ్యాగ్రౌండ్ సంగీతం ఎంత బావుంటే సీన్స్ అంత బాగా ఎలివేట్ అవుతాయి. 

ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో జిబ్రాన్ ఈ చిత్రాన్ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే ఈ చిత్రంలో ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఒకెత్తయితే.. జిబ్రాన్ సంగీతం మరో ఎత్తు. సుజీత్ దర్శకత్వంలో, యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios