Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ 2:సేనాపతి వేట స్టార్ట్!

22 ఏళ్ల తరువాత భారతీయుడు(1996) సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ని తెరకెక్కించడానికి మొత్తానికి సిద్దమయ్యాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ ను శుక్రవారం మొదలు పెట్టబోతున్నాడు ఈ ఇండియన్ స్టార్ డైరెక్టర్. 

indian 2 movie latest update
Author
Hyderabad, First Published Jan 17, 2019, 6:36 PM IST

సౌత్ సినిమా ఇండస్ట్రీలో శంకర్ మరో సీక్వెల్ కి శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యాడు. 22 ఏళ్ల తరువాత భారతీయుడు(1996) సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ని తెరకెక్కించడానికి మొత్తానికి సిద్దమయ్యాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ ను శుక్రవారం మొదలుపెట్టబోతున్నాడు ఈ ఇండియన్ స్టార్ డైరెక్టర్. 

అందుకు సంబందించిన ఇండియన్ 2 పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. ఒల్దర్ - వైజర్ - డెడ్ లయర్ అంటూ పోస్టర్ లో సేనాపతి సిద్దాంతాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాడు. ప్రస్తుతం రోజుల్లో జరుగుతున్న తప్పులను మోసాలను చూసి సేనాపతి మళ్ళీ తన వేటను ఎలా మొదలుపెట్టాడు అనేదే సీక్వెల్ కాన్సెప్ట్. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

ఇక కాజల్ కథానాయికగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నటీనటులతో వర్క్ షాప్ నిర్వహించిన దర్శకుడు శంకర్ శుక్రవారం నుంచి షూటింగ్ తో బిజీ కానున్నాడు. ఇక విలన్ గా అక్షయ్ కుమార్ నటించనున్నట్లు టాక్. 

ఇక సేనాపతి మనవడిగా సిద్దార్థ్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదట శింబును ఈ పాత్ర కోసం అనుకున్నప్పటికీ అతని డేట్స్ ఖాళీ లేకపోవడంతో శంకర్ సిద్దార్థ్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2020లో సినిమాను రిలీజ్ చేసే విధంగా శంకర్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు.    

Follow Us:
Download App:
  • android
  • ios